మహబూబ్‌నగర్: జిల్లా కేంద్రంలోని ప్రధాన రహదారులలో వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న తీరును సవిూక్షించిన ఎస్.పి. డాక్టర్ బి.అనురాధ గారు. రోడ్లపై అడ్డదిడ్డంగా వాహనాలు నిలిపే తీరుపై కఠిన చర్యలు చేపట్టాలని, ముఖ్యంగా ¬టళ్లు, షాప్ లు ఇతరత్రా దుకాణాల ముందు ఇబ్బంది కరంగా పార్కింగ్ చేసే వాహనదారులపై జరిమానాలు విధించాలని ఎస్.పి. గారు ఆదేశించారు. బాధ్యతారహితంగా వ్యవహరిస్తూ తమ దుకాణాల ముందు వాహనాలు నిలిపి ఉంచి ట్రాఫిక్ సమస్యలకు కారణం అవుతున్న ఆయా దుకాణాల యజమానులకు నోటీసులు అందిస్తూ హెచ్చరికలు జారీ చేయాలని ఎస్.పి. గారు ట్రాఫిక్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇదే సందర్భంలో అటుగా వెళ్తున్న కళాశాల విద్యార్ధినులను పలకరిస్తూ, ఈవ్ టీజింగ్ సమస్య గురించి అడిగి తెలుసుకుని, షీ టీమ్ ల గురించి వివరిస్తూ, ఎటువంటి ఇబ్బందులు ఉన్నా మీ పోలీసుకు సమాచారం ఇవ్వాలని సూచించారు.ఎస్.పి. గారి వెన్నంటి డి.ఎస్.పి. శ్రీ బి.భాస్కర్, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ శ్రీ అమరెందర్ రెడ్డి ఇతర అధికారులు ఉన్నారు.

Comments
Post a Comment