కింగ్‌ ఫిషర్‌ బీర్‌లో ఫంగస్‌

హైదరాబాద్‌ : బీరు బాబులూ బహు పారాక్‌. సీసాల సీసాలపై తాగేసే బీరు ప్రియులు ఇకపై చూసి తాగాల్సిందే. లేదంటే బీరులో ఫంగస్‌ చేరి ఉంటుంది. కింగ్‌ ఫిషర్‌ బీరులో ఫంగస్‌ వచ్చిన సంఘటన బేగంపేట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. నలుగురు మిత్రులు కలిసి సికింద్రాబాద్‌ బేగంపేటలోని హాట్‌ కఫ్‌( బాటిల్స్‌ అండ్‌ చివ్నిూస్‌) పబ్‌కి వెళ్లారు. కారు చీకటిలో ఒక్కొక్కరు ఒక్కో బీరు తాగారు. రెండో రౌండ్‌లో వేయిటర్‌ మరిన్ని బీర్లు ఇచ్చాడు. అందులో ఒక బీరులో తెల్లటి మచ్చలు, ఫంగస్‌ గమనించిన ప్రశ్నించగా తమకు ఎలాంటి సంబంధం లేదని, కావాలంటే మరో బీరు ఇస్తాం తీసుకోండి. లేదంటే విూ ఇష్టం ఉన్న చోట చెప్పుకొండి అంటూ దురుసుగా సమాధానం ఇచ్చారు. బాధితులు బేగంపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Comments