'సాహో'లో మెరిసిన అనుష్క

డార్లింగ్‌ ప్రభాస్‌ కథానాయకుడిగా నటిస్తున్న సినిమా 'సా¬'. సుజీత్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. అయితే షూటింగ్‌ బాహుబలి బ్యూటీ అనుష్క సందడి చేసింది. తన అభిమాన నటుడు, కొలీగ్‌ అయిన ప్రభాస్‌తో ఈ బ్యూటీకి మంచి రిలేషన్‌ ఉంది. దీంతో చిత్ర యూనిట్‌ను అభినందించడానికి అనుష్క వెళ్లింది. ఈ సందర్భంగా ఆమె సుజీత్‌, నటుడు మురళీశర్మతో కలిసి సెల్ఫీ దిగారు. ఈ ఫొటో ప్రస్తుతం వైరల్‌గా మారింది. 'సా¬' సినిమాలో కథానాయిక పాత్ర కోసం తొలుత అనుష్కను అనుకున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత చిత్ర బృందం బాలీవుడ్‌ నటి శ్రద్ధాకపూర్‌ను తీసుకుంది. అనుష్క, ప్రభాస్‌ మంచి స్నేహితులన్న విషయం తెలిసిందే. అయితే అనుష్క ఈ సినిమా సెట్‌కు వెళ్లడంతో ఆమె సినిమాలో అతిథి పాత్రలో కనిపించనున్నారా? అనే ఊహాగానాలు మొదలయ్యాయి.యూవీ క్రియేషన్స్‌ పతాకంపై వంశీ, ప్రమోద్‌ 'సా¬' సినిమాను నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో యాక్షన్‌కు ప్రాధాన్యం ఇస్తూ ఈ సినిమాను రూపొందిస్తున్నారు. తెలుగుతోపాటు తమిళం, మలయాళం, హిందీ భాషల్లో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు.

Comments