అత్తఓ అనసూయమ్మో..

అనసూయ..హాట్‌ యాంకర్‌..బుల్లితెరను ఏలుతోంది. తన హాట్‌ లుక్స్‌తో రేటింగ్స్‌ను విపరీతంగా పెంచేసే సత్తా ఉన్న యాంకర్‌. అటు బుల్లితెరపై స్టార్‌గా ఉంటూనే వెండితెరపై అదృష్టాన్ని పరిష్కరించుకోబోతోంది. ఇప్పటికే కొన్ని చిత్రాల్లో నటించి నటిగా ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు సుక్కు తీర్చిదిద్దుతున్న రంగస్థలంలో అనసూయ చరణ్‌కు అత్తగా నటిస్తోంది. సినిమా దాదాపు పూర్తికావొచ్చింది. ఈలోపే చరణ్‌..అనసూయలతో ఉన్న ఫొటోలను ఒక్కొక్కటిగా రిలీజ్‌ చేస్తూ సినిమాపై అంచనాలు పెంచుతున్నారు. ఇప్పటికే మేజర్‌ పార్ట్‌ షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు సంబంధించి కేవలం ఒక్క ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను మాత్రమే రిలీజ్‌ చేశారు యూనిట్‌. ఇప్పుడు అనసూయ ఈ మూవీలో నటిస్తుందన్న టాక్‌ తో సినిమాకు మరింత హైప్‌ తీసుకొచ్చింది. అయితే ఇటీవల రంగస్థలం సెట్‌ లో రామ్‌ చరణ్‌ తో సెల్ఫీ దిగిన అనసూయ..ఇప్పుడు ఈ సినిమాలో నటించనున్నట్లు వస్తున్న వార్తలు నిజమే అనే టాక్‌ వినిపిస్తుంది. పీరియాడిక్‌ లవ్‌ స్టోరిగా తెరకెక్కుతున్న ఈ సినిమా లోకేషన్‌ స్టిల్స్‌ ను రిలీజ్‌ చేస్తూ హడావిడి చేస్తున్నారు యూనిట్‌ సభ్యులు. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ భారీ బడ్జెట్‌ తో తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో చెర్రీ సరసన సమంత హీరోయిన్‌ గా నటిస్తుండగా.. జగపతి బాబు, ఆది పినిశెట్టి, రావు రమేష్‌లు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Comments