ఒకరి జిల్లాలో మరొకరి పర్యటన

మీ ఊరొచ్చా..మీ నట్టింటికి వచ్చా..ఇది బాలయ్య బాబు డైలాగ్‌..సరదాగా ఈ డైలాగ్‌ను అటు చంద్రబాబు..ఇటు వైఎస్‌ జగన్‌ ఇద్దరూ ఒకరినుద్దేశించి ఒకరు అనుకోవచ్చు. ఎందుకంటే ఇద్దరూ ఒకరు జిల్లాలో ఒకరు పర్యటిస్తున్నారు. చంద్రబాబు పులివెందులలో జన్మభూమి- మా ఊరు సభ పెడితే..సీఎం సొంత జిల్లాలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంకల్ప యాత్ర కొనసాగుతోంది. ఒకరి జిల్లాలో మరొకరు ఒకే సమయంలో అధికార, విపక్ష నేతలు పర్యటించడం అరుదైందే. వైఎస్‌ జగన్‌ ప్రజా సంకల్ప యాత్ర చేస్తున్నారు. ఇడుపుల పాయ నుంచి మొదలెట్టి అనంతపురం మీదుగా చిత్తూరు జిల్లాలో పాదయాత్ర చేస్తున్నారు. ఏపీ ప్రభుత్వ వైఫల్యాలపై సీఎం సొంత జిల్లాలో పాదయాత్ర చేస్తూ జగన్‌ విమర్శలు చేస్తున్నారు. ఎన్నికల నాడు ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని జగన్‌ విమర్శిస్తున్నారు. 
వైఎస్‌ జగన్‌ చిత్తూరుజిల్లాలో పాదయాత్ర చేస్తున్న సమయంలో ఏపీ ప్రభుత్వం జన్మభూమి, మా ఊరు కార్యక్రమాన్ని పులివెందులలో నిర్వహించింది. స్థానిక సమస్యలు తెలుసుకోవడం, పరిష్కరించడమే లక్ష్యంగా నిర్వహించిన జన్మభూమి కార్యక్రమంలో స్వయంగా సీఎం చంద్రబాబు పాల్గొనడంతో ప్రత్యేక ప్రాధాన్యత ఏర్పడింది. సీఎం సొంత జిల్లాలో.. ప్రతిపక్ష నేత అసెంబ్లీకి కూడా రాకుండా పర్యటిస్తుండడం, అదే సమయంలో వైఎస్‌ జగన్‌ సొంత నియోజక వర్గంలో సీఎం చంద్రబాబు కార్యక్రమం పెట్టుకోవడం చర్చనీయాంశమైంది. జన్మభూమి కార్యక్రమాన్ని పులివెందుల స్థానిక శాసన సభ్యుడైన వైఎస్‌ జగన్‌ లేని సమయంలో నిర్వహించడమేంటని వైసీపీ విమర్శిస్తుంటే, అంతా ప్రోటోకాల్‌ ప్రకారమే జరిగిందని అధికార పార్టీ సభ్యులు సమర్థించుకుంటున్నారు. 

కుప్పంనుంచే విజయం సాధనకు శ్రీకారం చుడదాం 
కుప్పంలో పాగా వేసి మన సత్తా చూపుదాం. టీడీపీకి దిమ్మదిరిగే షాక్‌ ఇద్దాం అంటూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు. ప్రజాసంకల్పయాత్ర కోసం కుప్పం నుంచి భారీగా తరలి వచ్చిన అభిమానులు, వైసీపీ శ్రేణులు, జగన్‌కు సంఘీభావం తెలిపాయి. వారిని ఉద్దేశించి వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ? బీసీలను సులువుగా మోసగించవచ్చని కుప్పం నియోజకవర్గాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంచుకున్నారని ఆయన విమర్శించారు. బీసీలకు ఏం చేశారని సీఎం చంద్రబాబు నాయుడుని నిలదీయాలంటూ కుప్పం ప్రజలకు పిలుపునిచ్చారు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి? కుప్పంలో చంద్రబాబును ఓడిస్తేనే బీసీలకు మేలు జరుగుతుందన్నారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించిన నవరత్నాలతో పేదలు, బీసీలు బాగుపడతారన్న వైఎస్‌ జగన్‌? మన గెలుపు కుప్పం నియోజకవర్గం నుండే మొదలుకావాలన్నారు. కుప్పం నుంచి వైసీపీ అభ్యర్థి చంద్రమౌళిని గెలిపిస్తే? కేబినెట్‌లో కూర్చోబెట్టి చంద్రబాబు కంటే మెరుగ్గా కుప్పంను అభివృద్ధి చేస్తానన్న జగన్‌? బస్సు యాత్రలో కుప్పం వచ్చి ప్రతీ మండలంలో పర్యటిస్తానని తెలిపారు.

Comments