అమ్రు లవ్‌లో పడింది..



అందం..అనుకువ..ధైర్యం..తెగువ అన్ని కలిసిన నేటితరం ప్రతినిధి ఆమ్రపాలి.. కలెక్టర్‌ అంటే ఇలా ఉండాలిరా అనేలా ప్రజల్లో కూడుకట్టుకున్న నాయకురాలు. తెలివితేటలు, ధైర్య సాహసాలతో ముందుడగు వేస్తున్నారు. ప్రతి పేదవాడూ మా అమ్మలా ఉన్నావ్‌ అనేలా..ప్రతి అమ్మాయీ అక్కా నువ్వే మాకు స్ఫూర్తి అనేలా.. యూత్‌ అంతా మా ఐకాన్‌ మీరే అన్నట్టు ఎదిగిపోయారు. బ్యూటిఫుల్‌, స్టైలిష్‌, యంగ్‌, డైనామిక్‌ లేడీ కలెక్టర్‌. ఆమె ఈ తరానికి ప్రతినిధి. పేరు.. తీరు..చూడగానే నార్త్‌ ఇండియన్‌లా అనిపించినా ఆమె స్వచ్ఛమైన తెలుగు అమ్మాయే. అది కూడా మన విశాఖ అమ్మాయే. ఆమె స్కూల్‌ డేస్‌ మొత్తం వైజాగ్‌లోనే..ఆమ్రపాలి ఐఏఎస్‌ కావడానికి స్ఫూర్తి ఆమె అక్కే. ఆమె కూడా ఐఏఎస్‌ అఫీసరే కావడం గమనార్హం. ఊహలు రెక్కలుతొడిగిన వయస్సులోనే నువ్వు ఏమవుతావ్‌ అంటే ఐఏఎస్‌ అని చెప్పేదట. ఇప్పుడు ఆమెకోసం ప్రస్థావన ఎందుకంటే 35 ఏళ్ల ఆమ్రపాలి ఫిబ్రవరి 18న ప్రేమ వివాహం చేసుకోబోతున్నారు. ఆమ్రపాలి లైఫ్‌స్టైల్‌పై 'వేన్యూ' ప్రత్యేక కథనం. 

ఆమ్రపాలి తండ్రి విశాఖపట్నానికి చెందిన కాట వెంకటరెడ్డి. ఆయన ఆంధ్రా యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేసి పదవీ విరమణ పొందారు. ఆమ్రపాలి చిన్నతనం నుంచి మంచి తెలివైన విద్యార్థిని. చదువులో చురుగ్గా ఉండేది. స్పోర్ట్స్‌ ముందంజలో ఉండేది. అన్నింటా తల్లి, అక్క సపోర్ట్‌ ఎక్కువ. రన్నింగ్‌, స్విమ్మింగ్‌లో అంటే ఇష్టం. విద్యార్థి దశలో హార్స్‌ రైడింగ్‌లో ఆమ్రపాలి గోల్డ్‌ మెడల్‌ కూడా తీసుకున్నారు. 

మద్రాస్‌ ఐఐటీ నుంచి ... 
ఆమ్రపాలి ఐఐటీ మద్రాస్‌ నుంచి సివిల్‌ ఇంజినీరింగ్‌లో బీటెక్‌ పూర్తి చేశారు. అనంతరం బెంగళూరు ఐఐఎం నుంచి పీజీ డిప్లొమా పట్టా అందుకున్నారు. ఐఏఎస్‌ కాకముందు జూనియర్‌ రిలేషన్‌షిప్‌ బ్యాంకర్‌గా పని చేశారు. 2010లో సివిల్స్‌ రాసి 39వ ర్యాంక్‌ సాధించారు. మంచి ర్యాంక్‌ రావడంతో సొంత రాష్ట్ర కేడర్‌లో ఐఏఎస్‌గా ఎంపికయ్యారు. 

వరంగల్‌ అర్బన్‌ కలెక్టర్‌గా.. 
2014లో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన ఆమ్రపాలి అనంతరం మహిళా శిశు సంక్షేమ విభాగానికి మారారు. కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత వరంగల్‌ అర్బన్‌ కలెక్టర్‌గా ఆమ్రపాలి 2016 అక్టోబరు 11న బాధ్యతలు స్వీకరించారు. నాటి నుంచి పాలనలో తనదైన ముద్ర వేస్తూ వరంగల్‌ను ఓడీఎఫ్‌( ఓపెన్‌ డిఫెక్షన్‌ ఫ్రీ)గా తీర్చిదిద్దడంలో కీలకపాత్ర పోషించారు. కేంద్రం నుంచి పలు అవార్డులు అందుకున్నారు. ప్రస్తుతం రూరల్‌ జిల్లాకు కూడా ఇన్‌ఛార్జి కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 

ప్రేమ గీతం 
ప్రేమ చిగురించింది. పరిణయంగా మారనుంది. యూత్‌ ఐకాన్‌గా...జనంలో మమేకమవుతూ తనకంటూ ప్రత్యేకతను చాటుకుంటున్న ఆమ్రపాలి (అమ్రు) త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు. 2010 ఐఏఎస్‌ ఆఫీసర్‌ అయిన ఆమ్రపాలి ఢిల్లీకి చెందిన 2011 బ్యాచ్‌కు చెందిన సమీర్‌ శర్మ అనే ఐపీఎస్‌ను ప్రేమ వివాహం చేసుకోబోతున్నారు. ఆమ్రపాలి కంటే సమీర్‌ శర్మ ఒక ఏడాది చిన్నవాడు కావడం విశేషం. ఇద్దరూ ఒకర్ని ఒకరు ఇష్టపడ్డారు. వీరి ప్రేమకు పెద్దలు కూడా ఓకే చెప్పారు. ముహూర్తం కుదిరింది. ప్రేమికుల దినోత్సవం ముగిసిన నాలుగు రోజులకు అంటే ఫిబ్రవరి 18న వీరిద్దరూ ఒకటికాబోతున్నారు. 
స్టైల్‌గా.. 
అమె డ్రెస్సింగ్‌లో ట్రెండ్‌కు తగ్గట్టు ఫాలో అవుతారు. కొత్తకొత్త ఫ్యాషన్స్‌తో వరెవ్వా అనిపిస్తారు. ఎంత చేసినా అతిగా ఉండదు. ఎంత ట్రెండ్‌ ఫాలో అయినా ఎక్కడా రిచ్‌ నెస్‌ తగ్గదు. అంతా క్లాసికల్‌ టచే. వరంగల్‌ యూత్‌కు ఆమె బ్రాండ్‌ అంబాసిడర్‌. కలెక్టర్‌ వేసుకున్న డ్రెస్సులను కాపీ కొట్టేస్తుంటారు. 

సినిమా తారలకు మించేలే 
ఆమ్రపాలి అందం ముందు సినీ తారలు కూడా తేలిపోతారు. ఆమెకే చదువే అందం అనుకుంటే..ఆ అందానికి బ్యూటీ తోడైతే..ఇంకేముంది అందరూ ఫిదా అయిపోరు. అందుకే సోషల్‌ మీడియాలో ఆమ్రపాలికి ఎందరో అభిమానులు ఉన్నారు. సినీ తారలకు మించిపోయేంతలా... 

ఏడాదంతా సెలవుపెట్టి తిరగాలని ఉంది 
ఏడాదంతా సెలవు పెట్టి దేశవిదేశాల్లో తిరగాలని ఉందని వెరైటీ కోరికను బయట పెట్టారు ఆమ్రపాలి. గతంలో ఓ ఇంటర్వ్యూలో ఆమె పలు అంశాలపై మాట్లాడారు. ఖాళీ సమయంలో టీవీ చూడడం, బుక్స్‌ చదవడం అంటే ఇష్టమని చెప్పారు. అంతేకాదు ఫిట్‌నెస్‌పై చాలా జాగ్రత్తగా ఉంటారు. ఉదయం యోగా చేస్తారు. ఇంట్లో పెంచుకుంటున్న పక్షులతో కాసేపు ఆడుకుంటారు. ఇవే ఆ రోజంతా ఉల్లాసంగా ఉండేందుకు దోహదపడతాయని చెబుతారు. 

సానియా మీర్జా..ప్రియాంక చోప్రా అంటే ఇష్టం 
సానియా మీర్జా, ప్రియాంక చోప్రా, అరుంధతీరాయ్‌ అంటే చాలా ఇష్టం. ఒక్కో సందర్భంలో ఒక్కొక్కర్ని ఆదర్శం. వారి వ్యక్తిత్వం..వారు సాధించిన విజయాలు స్ఫూర్తిదాయకం. అందుకే వారింటే ఇష్టం. 

వరంగల్‌ జిల్లాతో ప్రేమలో పడ్డా 

మీలో ఒక్కరిలా కలిసిపోతారు. స్నేహశీలి..టెక్నాలజీను వాడుకుంటూ ముందుకు దూసుకుపోతున్నారు. వరంగల్‌ జిల్లాతో ప్రేమలో పడ్డాను అంటుంటారు ఆమె. ఆమె పేదల పక్షపాతి. ఆకలితో అలమటించే వాళ్లకు అన్నం పరబ్రహ్మం పథకానికి విశేష ఆదరణ లభించింది. హోటల్‌, ఇతర ఫంక్షన్లలో మిగిలిన ఆహారాన్ని పేదలకు అందజేసే పథకం. దీనికి విపరీతమైన రెస్పాన్స్‌ వచ్చింది. 

బాహుబలి కోసం థియేటర్‌ బుకింగ్‌ 

బాహుబలి సినిమా రిలీజ్‌ రోజున చూడాలని ఎవరికుండదు. అధికారులు దీనికి మినాహాయింపు కాదు. అధికారులకు, సిబ్బందికి వినోదం కూడా అవసరమే అని భావించిన ఆమ్రపాలి..బాహుబలి సినిమా కోసం ఓ థియేటర్‌ మొత్తాన్ని బుక్‌ చేసి, అధికారులు, సిబ్బందితో సినిమా చూసినా ఆమెకే చెల్లింది. బహుశా దేశ చరిత్రలో ఇలా ఎక్కడా జరిగి ఉండదేమో. 

తెలుగు పాట డ్యాన్స్‌ చేసినా ఆమెకే చెల్లింది 
వికారాబాద్‌లో జరిగిన రాష్ట్ర అవతరణ వేడుకలో ఓ సినిమా పాటకు డ్యాన్స్‌ చేసి అందర్నీ అబ్బురపరిచారు. ఇలా ఆమ్రపాలి ఏం చేసినా సంచలనమే. అవినీతి అక్రమాలకు తావులేకుండా నిత్యం క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ముందుకు వెళుతున్నారు. యువతకు కోసం ఎన్నో కార్యక్రమాలు...గలగలమాట్లాడతారు. 

ఉదయం రెండు ఇడ్లీ..మధ్యాహ్నం పప్పు..నెయ్యి 
డైట్‌ విషయంలో ఆమ్రపాలి చాలా స్ట్రిక్ట్‌గా ఉంటారు. అందం..ఫిట్‌నెస్‌ కోసం చాలా కేర్‌ తీసుకుంటారు. ప్రతి రోజు ఉదయం రెండు ఇడ్లీలు మాత్రమే బ్రేక్‌ఫాస్ట్‌..మధ్యాహ్నం పప్పు..నెయ్యితో భోజనం..రాత్రి రెండు చపాతి. ఇంతే. అంతకు మించి మరేం తీసుకోరు. పూర్తిగా వెజిటేరియన్‌. అప్పడప్పుడూ జ్యూస్‌లు తాగుతారు. 


 
సినిమాల్లో ఆహ్వానం... 

ఆమ్రపాలి అందానికి టాలీవుడ్‌ దర్శకుడొకరు ఫిదా అయిపోయారట. ఆమె డ్రెస్‌ సెన్స్‌..స్టైల్‌ అంతా సూపర్‌గా ఉండటంతో ఓ సందర్భంలో తన సినిమాకు హీరోయిన్‌గా నటించాలని కూడా అడిగారట. దీనికి ఆమె సున్నితంగా తిరస్కరించారట.

Comments