విరాట్ అరుదైన ఫీట్‌ను అందుకోనున్నాడు. ఐసీసీ ప్రతిష్టాత్మక అవార్డులను ప్రకటించింది. 2017లో అత్యంత ప్రతిభ కనబరిచిన ఆటగాళ్లను ఈ అవార్డులకు ఎంపిక చేసింది. ఇందుకోసం టెస్టు, వన్డే, టీ20 మూడు ఫార్మాట్లలోనూ ఆటగాళ్ల ప్రదర్శనను పరిగణనలోకి తీసుకుంది.భారత పరుగుల యంత్రం, రికార్డుల రారాజు, కింగ్ కోహ్లీ 2017లో అంతర్జాతీయ క్రికెట్లో అద్భుత ప్రదర్శన కనబరిచినం దుకుగాను ఐసీసీ సర్ గార్‌ఫీల్డ్ సోబెర్స్ ట్రోఫీని అందుకున్నాడు. టెస్టు, వన్డే, టీ20 ఈ మూడు ఫార్మాట్లలోనూ విశేష ప్రతిభ కనబరిచిన ఆడటగాడికి ఐసీసీ ఈ అవార్డు అందజేస్తోంది. దీన్ని కోహ్లి కైవసం చేసుకోవడం ఇదే తొలిసారి.

Comments
Post a Comment