హైదరాబాద్: క్రికెట్ ఆడుతూ ఓ యువకుడు హఠాన్మరణం చెందాడు. బౌలింగ్ చేసిన అనంతరం స్టేడియంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయి మృతిచెందాడు. ఈ విషాద సంఘటన హైదరాబాద్ నగరంలోని బంజారాహిల్స్ రోడ్‌నెం.10 జహీరానగర్‌లో జరిగింది. లాయిడ్ ఆంథోనీ(23) అనే యువకుడు తన స్నేహితులతో మైదానంలో క్రికెట్ ఆడుతూ బౌలింగ్ చేశాడు. అనంతరం బోర్లాబొక్కల పడిపోయాడు. దీంతో తోటి క్రీడాకారులు వెంటనే అతన్ని లేపే ప్రయత్నం చేయగా ఫలితం లేకపోయింది. కాగా... తోటి క్రీడాకారుడు మృతిచెందడంతో అక్కడ విషాదం నెలకొంది. అంతేగాక ఆంథోని కుటుంబంలో కూడా తీవ్ర విషాదం నెలకొంది

Comments
Post a Comment