మందు భామ‌లు

హైద‌రాబాద్ : వీకెండ్‌ వస్తే సిటిజనులు ఎంతగా ఊగిపోతారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పబ్‌ల్లో ఎంజోయ్‌ చేస్తూ పొద్దుపోయేవరకూ పెగ్‌లేస్తూ మరో లోకంలో విహరిస్తారు. అబ్బాయిలు తాగి తందనాలు ఆడడం హైదరాబాద్‌ సిటీకి కొత్తేమీ కాదు...వారికి పోటీగా అమ్మాయిలు ఫుల్‌ బాటిల్స్‌ ఎత్తేస్తున్నారు. ఎక్కడా తగ్గడం లేదు. ఖరీదైన భామలంతా ఒళ్లు మరిచి మందేస్తూ చిందేస్తున్నారు. తాజాగా శనివారం రాత్రి జూబ్లీహిల్స్‌  ఏరియాలో పోలీసులు డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీలు నిర్వహిస్తుండగా, ఖరీదైన కార్లలో వచ్చిన బడాబాబుల అమ్మాయిలు కాసేపు నానా హంగామా చేశారు. బ్రీత్‌ అనలైజర్‌కు సహకరించకుండా ఇష్టానుసారంగా వ్యవహరించారు. చివరకు మహిళా పోలీసుల సాయంతో వారిని బ్రీత్‌ ఎనలైజర్‌ టెస్ట్‌ చేయగా పూటుగా తాగినట్టు తేలింది. దీంతో వారు నడుపుతున్న కార్లను స్వాధీనం చేసుకున్నారు. ఇలా 14 మంది దొరికిపోయారు. తల్లిదండ్రుల సమక్షంలో వీరికి కౌన్సెలింగ్‌ ఇస్తామని పోలీసులు తెలిపారు. 

Comments