పీఈటీపై నిర్భయ కేసు

హైదరాబాదు: మహిళా టీచర్‌పై లైంగిక వేధింపులకు పాల్పడిన పీఈటీపై చాదర్‌ఘాట్‌ పోలీసులు నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు. ఓల్డ్‌ మలక్‌పేటకు చెందిన మహిళ ఓ హైస్కూల్‌లో టీచర్‌గా పనిచేస్తోంది. అదే పాఠశాలలో పీఈటీగా పనిచేస్తున్న కట్టెల శ్రీనివాస్‌ నెల రోజులుగా తనను లైంగికంగా వేధిస్తున్నాడని ఆమె పోలీసులకు మంగళవారం ఫిర్యాదు చేసింది. శ్రీనివాస్‌ను అరెస్టు చేసి నిర్భయ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments