పద్మావత్‌పై పిల్‌ తిరస్కరణ

న్యూఢిల్లీ: పద్మావత్‌ విడుదలకు ఆటంకాలు సృష్టిస్తూనే ఉన్నారు. సుప్రీం కోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినా సినిమా విడుదల చేస్తే ఊరుకునేది లేదని కొందరు హెచ్చరిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా శుక్రవారం పద్మావత్‌ రిలీజ్‌ చేయకూడదంటూ సుప్రీంలో పిల్‌ దాఖలు చేశారు. ఆ వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు కొట్టిపారేసింది. లాయర్‌ మనోహర్‌ లాల్‌ శర్మ ఆ పిల్‌ను వేశారు. సెన్సార్‌ బోర్డు పద్మావత్‌ సినిమాకు అక్రమంగా సర్టిఫికెట్‌ ఇచ్చినట్లు ఆయన తన పిల్‌లో ఆరోపించారు. అయితే ఆ పిల్‌పై ఇవాళ త్రిసభ్య ధర్మాసనం తీర్పును ఇచ్చింది. చీఫ్‌ జస్టిస్‌ దీపక్‌ మిశ్రా నేతృత్వంలో త్రిసభ్య ధర్మాసనాన్ని ఏర్పాటు చేశారు. సుప్రీంకోర్టు ఓ రాజ్యాంగ కోర్టుగా తన పాలన చేయాలని, పద్మావత్‌ సినిమాను బ్లాక్‌ చేయరాదు అని గురువారమే మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశామని చీఫ్‌ జస్టిస్‌ గుర్తు చేశారు.

Comments