మహిళలపై నిత్యం లైంగిక వేధింపులు జరుగుతున్నాయి. ఎన్ని చట్టాలు...మరెన్ని శిక్షలు పడుతున్నా ఇవి ఆగడం లేదు. మహిళలపై లైంగిక వేధింపులు, వివాదాలపై ధైర్యంగా ఓపెన్ అయ్యేందుకు వేదికగా ఉపకరించింది హ్యాష్‌ట్యాగ్ మిటు క్యాంపెయిన్. ఇందులో సెలబ్రిటీల ప్రచారం ¬రెత్తింది. మిటు హ్యాష్‌ట్యాగ్ క్యాపెయినింగ్‌లో ఎన్నో నిజాలు బట్టబయల య్యాయి. పలువురు టాప్ సెలబ్రిటీలు తమకు జరిగిన అన్యాయంపై గొంతెత్తారు. సామాజిక మాధ్యమాల్లోకి వచ్చి తమపై అఘాయిత్యాలకు పాల్పడిన వారి గురించి ప్రపంచానికి తెలిసేలా వెలుగెత్తి చాటారు. 2017 ఆద్యంతం మిటు -ప్రమోషన్‌తో ¬రెత్తిపోయింది. ప్రముఖ హాలీవుడ్ దర్శకనటులు, నిర్మాతలపై తీవ్ర ఆరోపణలు చేశారు పలువురు హాలీవుడ్ కథానాయికలు. హార్వే వీన్‌స్టీన్, కెవిన్ స్పేసీ వంటి దిగ్గజాలకు శంకరమాన్యాలు పట్టాల్సిన సన్నివేశమే ఎదురైంది ఈ ప్రచారంతో. మొత్తానికి అలాంటిదే వేరొక కొత్త క్యాంపెయిన్‌ని 2018లో ప్రారంభించారు హాలీవుడ్ నాయికలు.
'వండర్ ఉమెన్' ఫేం గాల్ గాడోట్, ఎమ్మా వాట్సన్, జెన్నిఫర్ లోపేజ్ వంటి టాప్ స్టార్స్ లైవ్‌లోకి వచ్చి 'టైమ్స్ అప్' అంటూ ఓ కొత్త ప్రచారానికి తెరతీశారు. స్త్రీలపై, కథానాయికలపై లైంగిక వేధింపులు, శారీరక హింస వంటి వాటికి పాల్పడే పురుషపుంగవులపై యథేచ్ఛగా ఇక్కడ ఫిర్యాదు చేయొచ్చని ప్రకటించారు. సదరు కథానాయికలు ఎవరికి వారు దీనిపై కొటేషన్స్‌ని రాసి వాటిని సామాజిక మాధ్యమాల్లో ప్రమోషన్ చేస్తున్నారు. హాలీవుడ్ నాయికలంతా కలిసి ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళుతుండడం విశేషం. ఈ ప్రచారంతో ఇంకెంత మంది వీన్‌స్టీన్‌లు, స్పేసీలు కొత్త ఏడాది కానుకగా బయటపడతారో చూడాలి!!

Comments
Post a Comment