నెట్‌ ఇంటి దొంగలు


  • సచివాలయంతో ప్రభుత్వ కార్యాలయాలో అడ్డమైన డౌన్‌లోడింగ్స్‌ 
  • నెల రోజులు వాడాల్సిన 50 జీబీ..రెండు మూడు రోజులకే ఫినిష్‌ 
మనది కాని వస్తువును ఎలా వాడినా పర్వాలేదన్న భావన చాలా మందిలో ఉంటుంది. సేవల్లో పారదర్శకత కోసం...పని సులువు కోసం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం సచివాలయంలో లక్షలు వెచ్చించి ఇంటర్‌నెట్‌ సౌకర్యం లేనిపోని సైట్లపైకి పోతోంది. మౌస్‌ క్లిక్‌ చేస్తే ట్రిపుల్‌ ఎక్స్‌ అంటూ వేళ్లు కీ బోర్డుపై నాట్యం చేస్తున్నాయి. ఇదంతా మన అధికారులు, ఉద్యోగుల కామో..కామోస్య..కామోభ్యహ అన్నమాట. కార్యాలయాల్లో ఉద్యోగులు అశ్లీల సైట్లుచూస్తూ..నచ్చిన సినిమాలు డౌన్‌ లోడ్‌ చేసుకుంటున్నారు.ఇతర ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన ఇంటర్‌నెట్‌ సౌకర్యాన్ని కొందరు ఉద్యోగులు అడ్డమైన పనులకు వాడేసుకుంటున్నారు. ఉద్యోగులు అసభ్యకర వీడియోలు చూడటమే కాకుండా సినిమాలు కూడా డౌన్‌ లోడ్‌ చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఏపీ స్టేట్‌ ఫైబర్‌ నెట్‌ కార్పొరేషన్‌ ప్రభుత్వ కార్యాలయాల్లో 100 ఎంబీపీఎస్‌ స్పీడుతో నెలకు 50 జీబీల సామర్థ్యం గల ఇంటర్‌ నెట్‌ సౌకర్యాన్ని రూ.999లకు అందిస్తోంది. కొందరు ప్రభుత్వ ఉద్యోగులు కార్యాలయాల్లోనే సినిమాలు, వ్యక్తిగత సమాచారాన్ని డౌన్‌ లోడ్‌ చేస్తుండటంతో యాభై జీబీ నెట్‌ ప్యాకేజీ రెండు, మూడు రోజులకే అయిపోతుందట. ఏపీలోని మూడువేల ప్రభుత్వ కార్యాలయాల్లో ఇంటర్‌ నెట్‌ కనెక్షన్లు ఉండగా వీటిలో ఉద్యోగులు సినిమాలు డౌన్‌ లోడ్‌ చేస్తున్నారు. దీంతో అధికారిక పనుల కోసం ఇంటర్‌ నెట్‌ అందుబాటులో ఉండటం లేదని ఉన్నతాధికారులు అంటున్నారు. మొత్తం మీద సర్కారు కార్యాలయాల్లో కొందరు ఉద్యోగులు అధికారిక ఇంటర్‌ నెట్‌ ను వినోదానికి వాడుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరి నెట్‌ఇంట్లో దొంగలపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.

Comments