''నేను రాసుకున్న పవిత్రమైన స్క్రిప్టుని బూతుగా మార్చి నాశనం చేశాడం''టూ యువరచయిత పి.జయకుమార్ రామ్‌గోపాల్ వర్మపై తీవ్రంగా ఆరోపించారు. వర్మ తెరకెక్కించిన 'గాడ్ సెక్స్ అండ్ ట్రూత్' వెబ్ సిరీస్ కథ తనదేనని, దానిని వర్మ బూతుగా మార్చేశాడని ఈ యువరచయిత ఇదివరకూ ఆరోపించిన సంగతి తెలిసిందే. అటుపై అతడు వర్మపై కోర్టుకు వెళ్లాడు. తాజాగా వర్మకు, మియా మల్కోవాలకు కోర్టు నోటీసులు పంపించింది.గాడ్ , సెక్స్ అండ్ ట్రూత్ .. నా కథేనంటున్న పి.జయ కుమార్.. కోర్టులో వాదిస్తున్నారు. ఇదివరకూ వర్మ తెరకెక్కించిన 'సర్కార్ 3' కథలోనూ ఈ యువ రచయిత భాగస్వామ్యం ఉంది. ప్రస్తుతం హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు కాపీ రైట్ పరిధిలో విచారిస్తోంది. దర్శకులు రాంగోపాల్ వర్మ తో పాటుగా పోర్న్ స్టార్ మియా మల్కోవా, యూ ట్యూబ్ ఛానల్ పైనా.. సిటీ సివిల్ కోర్టు నోటీసులు పంపించిందిట. తాను ఎంతో పవిత్రంగా భావించి రాసుకున్న స్క్రిప్టులోకి బూతు పురాణం జొప్పించి, వర్మ శృంగార సినిమాని తెరకెక్కించారని జయకుమార్ ఆరోపిస్తున్నారు.

Comments
Post a Comment