వందకోట్ల 'పద్మావత్‌'

ఈ మధ్య కాలంలో ఏ సినిమాకు రానన్ని వివాదాలు 'పద్మావత్‌'ను చుట్టుముట్టేశాయి. వాటన్నింటినీ 
ఎదుర్కొని వెండితెరపై తన సత్తా చాటింది. రాజ్‌ పుత్‌ ల గొప్పదనాన్ని చెబుతూ చరిత్రను వక్రీకరించకుండా దర్శకుడు తెరకెక్కించిన ఈ సినిమా ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటోంది. రణవీర్‌ కపూర్‌, దీపికా పదుకోన్‌, షాహిద్‌ కపూర్‌ లు నటించిన ఈ సినిమా వంద కోట్ల దిశగా పరుగులు తీస్తోంది.ప్రీమియర్‌ షోల ద్వారా రూ.5 కోట్ల రూపాయలను కలెక్ట్‌ చేసిన ఈ సినిమా గురువారం నాడు రూ.19కోట్లు, శుక్రవారం రూ.32 కోట్లు, శనివారం రూ.27కోట్లు వసూలు చేసింది. మొత్తంగా ఇప్పటివరకు బాక్సాఫీస్‌ వద్ద రూ.83 కోట్లను వసూలు చేసిన ఈ సినిమా ఈరోజుతో రూ.100 కోట్లు కొల్లగొట్టడం ఖాయమని ప్రముఖ సినీ విశ్లేషకుడు తరణ్‌ ఆదర్శ్‌ వెల్లడించారు.

Comments