ఓ మై డార్లింగో అంటున్న శ్రద్ధా

బాహుబలి అజానుభావుడు, డార్లింగ్‌ ప్రభాస్‌కు బాలీవుడ్‌ సుందరి శ్రద్ధాకపూర్‌ పడిపోయింది. ఎంతలా అంటే ఎక్కడి వెళ్లినా ప్రభాస్‌ నామజపమే అన్నట్టు. ఓ మై డార్లింగ్‌ అంటూ ప్రభాస్‌ను ఆకాశానికి ఎత్తేస్తుంది. బాహుబలి సిరీస్‌తో వరల్డ్‌ వైడ్‌ ఫేమస్‌ అయిన ప్రభాస్‌ సరసన అవకాశం అంటే ఆషామాషీనా? ఇదే విషయాన్ని శ్రద్ధా ఎంతో వినమ్రంగా చెప్పుకొచ్చింది. ప్రభాస్‌ అంత పెద్ద స్టార్‌తో నటించడం ఎంతో ఆనందాన్నిస్తోంది. ఒకేసారి తెలుగు, హిందీ ద్విభాషా చిత్రంలో నటిస్తున్నా. 'సా¬' హిందీ, తెలుగుతో పాటు ఇరుగుపొరుగు భాషల్లోకి అనువాదమై రిలీజవుతోంది. ఇంత పెద్ద ప్రాజెక్టులో ఛాన్స్‌ దక్కడం అదృష్టం అంటూ కితాబిచ్చింది. శ్రద్ధా ఎక్కడికి వెళ్లినా అక్కడ 'సా¬' గురించి, ప్రభాస్‌ గురించే ప్రస్థావిస్తోంది. ఏ వేదికకు వెళ్లినా ప్రభాస్‌ గురించే ముచ్చట్లు పెడుతోంది. గ్రేట్‌ ఛాన్స్‌ అంటూ పొగిడేస్తోంది. ఓ రకంగా ప్రభాస్‌ని దేవుడిలాగా చూస్తోంది. మంచిదే దీనివల్ల సా¬కి, ప్రభాస్‌కి మరింతగా ప్రచారం పరంగా మైలేజ్‌ పెరుగుతున్నట్టే. బాహుబలి తర్వాత మళ్లీ అంతే ప్రతిష్ఠాత్మక చిత్రంగా భావిస్తున్న 'సా¬' దాదాపు 200 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. తాజాగా రాజ్‌కుమార్‌ రావ్‌-శ్రద్ధా కపూర్‌ జంటగా 'స్త్రీ' చిత్రీకరణ సాగుతోంది. ఈ సినిమా ప్రెస్‌విూట్‌లో ప్రభాను మరోసారి ఆకాశానికెత్తేసింది శ్రద్ధా.

Comments