నేటి యువత తమ శరీరంపై పలు చోట్ల టాటూలు వేసుకోవడం సర్వసాధారణం. అయితే ఇలా టాటూలు వేసుకోవడం వల్ల వారు కొన్ని సందర్భాల్లో ఉద్యోగాలు కోల్పోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. భారత వాయు సేనలో ఎయిర్‌మెన్ ఉద్యోగంలో చేరబోయే వ్యక్తి నిబంధనలకు విరుద్ధంగా తన మోచేతులపై వేసుకున్న టాటూ వల్ల ఉద్యోగాన్ని కోల్పోవాల్సి వచ్చింది. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సదురు ఉద్యోగి ఢిల్లీ హైకోర్టులో వేసిన పిటీషన్‌ను న్యాయస్థానం తిరస్కరించింది.పిటిషనర్ భారత వాయుసేనలో ఎయిర్‌మెన్ ఉద్యోగానికి 2016లో దరఖాస్తు చేశారు. అన్ని రకాల పరీక్షలను దాటుకుని ఉద్యోగానికి ఎంపికయ్యారు. 2017, డిసెంబరు 24న ఉద్యోగంలో చేరాలని వాయుసేన ఆయనకి అపాయింట్‌మెంట్ లెటర్‌ను పంపించింది. అనుకున్న రోజు ఉద్యోగంలో చేరిన అతనికి చేదు అనుభవం ఎదురైంది. అతని శరీరంపై ఉన్న టాటూ వాయుసేన నియమ నిబంధనలకు విరుద్ధంగా ఉండడంతో ఉద్యోగంలో చేరిన మరుసటి రోజే అతన్ని అధికారులు ఉద్యోగం నుంచి తొలగించారు. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సదురు ఉద్యోగి ఢిల్లీ హైకోర్టులో వేసిన పిటిషన్‌ను జస్టిస్ హిమా కోహ్లీ, రేఖా పాలీలతో కూడిన ధర్మాసనం విచారించింది.
అయితే ఇది నియమ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్లు తేలడంతో అతని పిటిషన్‌ను తిరస్కరించింది. వాయుసేనలో టాటూలకు సంబంధించి పలు నిబంధనలు ఉన్నాయి. గిరిజన సంప్రదాయాలు, సంస్కృతులను దృష్టిలో పెట్టుకుని ఆ వర్గం వారికి టాటూ నిబంధనల నుంచి మినహాయింపు ఉంది.

Comments
Post a Comment