సుప్రీం వ్యవస్థపై తిరుగుబాటు


          దేశ చరిత్రలో తొలిసారిగా నలుగురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు 
  • లోపాలను సరిదిద్దాలని సూచించినా చీఫ్‌ జస్టిస్‌ పట్టించుకోలేదు 

  • అందుకే ప్రజల ముందుకు వచ్చాం 

  • న్యాయమూర్తులు చలమేశ్వరరావు,లోకుల్‌,కురియన్‌ జోసెఫ్‌,గోగోయ్‌ 

  • ప్రధానితో న్యాయశాఖ మంత్రి చర్చలు 

  • అటర్నీ జర్నల్‌తో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి భేటీ


సుప్రీంకోర్టు చోటుచేసుకుంటున్న పరిణామాలు బాధ కలిగిస్తున్నాయి. సుప్రీంకోర్టు పవిత్రత కాపాడకపోతే ప్రజాస్వామ్యానికే సిగ్గుచేటు. సుప్రీం కోర్టులో కొన్ని జరగకూడని పరిణామాలు చోటుచేసుకున్నాయి. సుప్రీంకోర్టు గౌరవాన్ని కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ చలమేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు చరిత్రలో తొలిసారిగా నలుగురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు మీడియా సమావేశం నిర్వహించడం సంచలనంగా మారింది. సుప్రీంకోర్టు లోపాలను సరిదిద్దాలని ఉద్దేశంతో మేం నలుగురం జస్టిస్‌ లోకుల్‌, జస్టిస్‌ కురియన్‌ జోసెఫ్‌, జస్టిస్‌ గోగోయ్‌లు కలుసుకున్నట్టు చలమేశ్వరరావు చెప్పారు. సుప్రీంకోర్టులో జరుగుతున్న పరిణామాలు ప్రజలకు వివరించాలనే ఉద్దేశంతో మీడియా సమావేశం నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. ఓ పద్ధతి ప్రకారం ముందుకు వెళతామంటే చీఫ్‌ జస్టిస్‌ ఒప్పుకోలేదన్నారు. సుప్రీంకోర్టులో జరగకూడనవి చాలా జరిగాయి. అందుకు బాధకలిగింది. చీఫ్‌ జస్టిస్‌ను అభిశంసన చేయాలా ? వద్దా? అన్నది దేశం తేల్చుకోవాలన్నారు. సుప్రీంకోర్టులో పరిపాలన సరిగా లేదని ఈ నలుగురు న్యాయమూర్తులు సంయుక్తంగా స్పష్టం చేశారు. ఇవాళ ఉదయం కూడా సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిని కలిశాం. సుప్రీం కోర్టులో జరుగుతున్న పరిణామాలను మరోమారు వివరించాం. అయినా మాకు మరో అవకాశం లేకుండా చీఫ్‌ జస్టిస్‌ వ్యవహరించారు. మా ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. అందుకే ప్రజల ముందుకు వచ్చామని పేర్కొన్నారు. 

ప్రధానితో న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ భేటి 

దేశ చరిత్రలో సుప్రీం కోర్టు న్యాయమూర్తులు సుప్రీంకోర్టులో జరుగుతున్న పరిణామాలను మీడియాకు వివరించడం సంచనలంగా మారింది. దీంతో తక్షణం న్యాయశాఖ రంగంలోకి దిగింది. ప్రధాని నరేంద్రమోడీతో న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ అత్యవసర భేటీ అయ్యారు. జస్టిస్‌ చలమేశ్వరరావు బృందం చేసిన ఆరోపణలు, సుప్రీంకోర్టులో నెలకున్న పరిస్థితులపై చర్చించారు. 

అటర్నీ జర్నల్‌తో సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ 

సుప్రీంకోర్టు న్యాయమూర్తులు నలుగురు లేవనెత్తి పలు అంశాలు..మీడియా సమావేశం ఏర్పాటు తదితర అంశాలపై సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ అటర్నీ జర్నల్‌తో భేటీ కానున్నారు. శుక్రవారం నెలకున్న పరిస్థితులపై చర్చించనున్నారు. 

మరో సారి మీడియా ప్రాధాన్యత 

మీడియా ప్రాధాన్యత ఏంటో మరోసారి స్పష్టమైంది. దేశ సర్వోన్నత న్యాయం స్థానంలో జరుగుతున్న పరిణామాలు ఇంతవరకూ మూడో కంటికి తెలియవు. వాటిపై వార్తలు..కథనాలు కూడా రావు. వచ్చినా ఎంతో జాగ్రత్తగా రాయాల్సిన పరిస్థితి. ఎందుకంటే.. ప్రజా స్వామ్యాన్ని కాపాడే న్యాయవ్యవస్థకు ఇచ్చే గౌరవం. అందులోనే లోపాలుంటే ఎవరికి చెప్పుకోవాలి? సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి చెప్పుకోవాలి...మరి అక్కడ కూడా మాకు న్యాయం జరగలేదని సుప్రీం కోర్టు న్యాయమూర్తులు మీడియానే ఆశ్రయించారు. మీడియా ద్వారానే ప్రజలకు ఎన్నో విషయాలు చెప్పారు.

Comments