హ్యాంగ్‌కాంగ్: చైనాకు చెందిన అంతరిక్ష కేంద్రం కూలిపోనున్నది. తొమ్మిది టన్నుల బరువున్న టియాంగాంగ్ 1 త్వరలో భూమిపై పడిపోనున్నది. డ్రాగన్ దేశం చైనా స్పేస్ ల్యాబ్‌ను మొదటిసారి నిర్మించింది. నిజానికి 2020 మధ్య వరకూ ఆ స్పేస్ స్టేషన్‌ను వివిధ రకాల ప్రయోగాల కోసం వాడాలని చైనా భావించింది. కానీ అనూహ్యంగా టియాంగాంగ్ లైఫ్ ముగిసినట్లు ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. బహుశా.. ఈ ఏడాది మార్చి నెలలోగా ఈ అంతరిక్ష కేంద్రం కూలిపోయే ప్రమాదం ఉందని అంచనా వేస్తున్నారు. అయితే ఖచ్చితంగా ఎప్పుడు పడిపోతుందన్న తేదీని మాత్రం చెప్పలేకపోతున్నారు. ఒకవేళ స్పేస్ స్టేషన్ కూలితే, అది ఎక్కడ పడుతుంది, దాని వల్ల ఎంత మందికి నష్టం జరిగే ప్రమాదం ఉందన్న అంశాన్ని కూడా స్పష్టంగా తేల్చలేకపోతున్నారు.కానీ కాలం చెల్లిన టియాంగాంగ్ మాత్రం భూ కక్ష్యలోకి రాగానే.. అది భూ వాతావరణంలోనే భస్మం అయ్యే అవకాశాలు ఉన్నట్లు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. సౌరశక్తితో నడిచే ఈ స్పేస్ స్టేషన్ సుమారు 11 విూటర్ల పొడుగు ఉంటుంది. ఆస్ట్రోనాట్లకు స్లీప్ స్టేషన్లు కూడా ఉన్నాయి.
సెప్టెంబర్ 2011లో టియాంగాంగ్‌ను అంతరిక్షంలోకి ప్రయోగించారు. ఆ ఏడాది నవంబర్‌లోనే చైనా దానికి షెంజో స్పేస్‌క్రాఫ్ట్‌ను కూడా లింక్ చేసింది. ఆ తర్వాత రెండు సార్లు ఆస్ట్రోనాట్లు ఆ స్పేస్ ల్యాబ్‌కు వెళ్లి వచ్చారు.

Comments
Post a Comment