యూట్యూబ్‌లో ఊపేస్తున్న కొడకా సాంగ్‌

పవన్‌ సినిమా అంటేనే ఓ ఊపు..ఓ ఉత్సాహం..ఓ కిక్‌..అటువంటి పవర్‌ స్టారే స్వయంగా పాడితే అభిమానులు ఊగిపోరూ..యూట్యూబ్‌ మురిసిపోదూ. త్రివిక్రమ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన అత్తారింటికి దారేది చిత్రంలో 'కాటమరాయుడా కదిరీ నరసింహుడా' అనే పాటని పవన్‌ చేత పాడించి అభిమానులలో హిస్టీరియా తెప్పించాడు మాటల మాంత్రికుడు. ఇప్పుడు తాజాగా అజ్ఞాతవాసి చిత్రం కోసం 'కొడకా కోటేశ్వర రావు' అనే పాట పాడించాడు. అనిరుథ్‌్‌ రవిచంద్రన్‌ సంగీతంలో రూపొందిన ఈ సాంగ్‌ న్యూ ఇయర్‌ సందర్భంగా డిసెంబర్‌ 31 సాయంత్రం 6గం.లకు విడుదలైంది. విడుదలైన కొన్ని గంటలలోనే ఈ సాంగ్‌ సంచలనాలు సృష్టిస్తుంది. ఈ పాట రిలీజై 24 గంటలు గడవకముందే, యూట్యూబ్‌ లో 3.02 మిలియన్ల వ్యూస్‌ను.. 3లకు పైగా లక్షల లైక్స్‌ను రాబట్టింది. దీనిని బట్టి చూస్తుంటే పవన్‌ పాటకి ఫ్యాన్స్‌ ఎంతగా ముగ్ధులయ్యారో తెలుస్తుంది. ఇక జనవరి 10న విడుదల కానున్న చిత్రం కోసం ఫ్యాన్స్‌ చాలా ఆసక్తిగా ఎదరు చూస్తున్నారు. ఓవర్సీస్‌లో భారీ సంఖ్యలో విడుదల కానున్న అజ్ఞాతవాసి చిత్రం తెలుగు రాష్ట్రాలలోను ఎక్కువ థియేటర్స్‌లో విడుదల కానుంది. హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ బేనర్‌ పై రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్‌, అను ఎమ్మాన్యుయేల్‌ కథానాయికలుగా నటించారు.

Comments