జనవరి 9న శ్రీవారి సేవ 'రథసప్తమి' స్లాట్‌ విడుదల

తిరుమల : జనవరి 24న రథసప్తమి పర్వదినం నాడు తిరుమలకు విశేషంగా విచ్చేసే భక్తులకు సేవలందించేందుకు శ్రీవారి సేవ ''ప్రత్యేక సందర్భాల'' స్లాట్‌ను జనవరి 9వ తేదీన టీటీడీి విడుదల చేసింది. ఈ స్లాట్‌కు సేవకుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. మొదటి బ్యాచ్‌లో వైకుంఠ ఏకాదశి సందర్భంగా 300 మంది ఈ స్లాట్‌ను బుక్‌ చేసుకుని భక్తులకు మెరుగైన సేవలందించారు. 
డాక్టర్లు, సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు, ప్రభుత్వ, ప్రయివేటు ఉద్యోగులు ఈ సేవకు విచ్చేశారు. వైకుంఠ ఏకాదశి, రథసప్తమి, శ్రీవారి బ్రహ్మోత్స‌వాలులాంటి రద్దీ సమయాల్లో ''ప్రత్యేక సందర్భాల'' స్లాట్‌ను ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకుని భక్తులకు సేవలందించవచ్చు. 
ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ ఆదేశాల మేరకు తిరుమల జెఈవో శ్రీకె.ఎస్‌.శ్రీనివాసరాజు పర్యవేక్షణలో రథసప్తమి పర్వదినానికి గాను జనవరి 9వ తేదీ సాయంత్రం 7 గంటలకు ఆన్‌లైన్‌లో స్లాట్‌ను అందుబాటులో ఉంచుతారు. 25 ఏళ్ల నుంచి 40 ఏళ్లలోపు గల 300 మందికి ఈ స్లాట్‌ను బుక్‌ చేసుకునే అవకాశముంది. 
ఆసక్తి గలవారు తమ ఆధార్‌ కార్డు ద్వారా విడివిడిగా నమోదు చేసుకోవచ్చు. ఈ స్లాట్‌ పొందిన భక్తులు జనవరి 22వ తేదీన తిరుమలలోని శ్రీవారి సేవాసదన్‌లో రిపోర్టు చేయాలి. 
జనవరి 23, 24వ తేదీల్లో భక్తులకు సేవలందించాల్సి ఉంటుంది. 
టిటిడి వెబ్‌సైట్‌www.tirumala.orgలో 'శ్రీవారిసేవ సర్వీసెస్‌' అనే లింక్‌ను క్లిక్‌ చేసి 'శ్రీవారి సేవ' - 'స్పెషల్‌ సేవ' అనే ఆప్షన్ల ద్వారా ఈ స్లాట్‌ను బుక్‌ చేసుకోవచ్చు.

Comments