మంచు చరియలు విరిడిపడి 8 మంద గల్లంతు

మంచుచరియలు విరిగిపడి 8 మంది వ్యక్తులు గల్లంతైయ్యారు. ఈ ఘటన జమ్ముకశ్మీర్‌లోని కుప్వారాలో జిల్లాలో చోటుచేసుకుంది. టాటా సుమో వాహనంలో కుప్వారా నుంచి కర్ణాకు బయల్దేరి వెళ్తుండగా మంచుచరియలు ఒక్కసారిగా విరిగిపడి వాహనంపై పడ్డాయి.ఇదే సంఘటనలో సరిహద్దు రహదారుల సిబ్బంది సైతం గల్లంతైనట్లు సమాచారం. స్థానిక పోలీసులు, రాష్ట్ర విపత్తు నిర్వహణ సిబ్బంది, మౌంటేన్‌ రెస్యూ సిబ్బంది సంఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టారు. చీకటి పడటంతో సహయక చర్యలకు విఘాతం ఏర్పడింది...

Comments