కిలో మల్లెలు 7500

చెన్నై: తమిళనాడులోని తేని జిల్లాలో కిలో మల్లెపూల ధర రూ.7,500లకు పెరిగింది. ఈ జిల్లాలోని పలు గ్రామాల్లో సాగుచేస్తున్న మల్లెపూల దిగుబడి వేసవిలో ఎక్కువగా ఉంటుంది. దిగుబడి ఎక్కువగా ఉన్న కాలంలో సెంటు తయారీకి పువ్వులను తరలిస్తుంటారు. ప్రస్తుతం దిగుబడి లేక ధరలు పెరిగాయి. ఈ విషయమై పూల వ్యాపారులు మాట్లాడుతూ... గత నెల రూ.1000కి విక్రయించిన మల్లె పూలు సంక్రాంతికి కిలో రూ.3 వేలుగాను, గతవారం రూ.4,500 గాను ధర పలికాయని, ఆండిపట్టి, తేని మార్కెట్లలో ప్రస్తుతం కిలో రూ.7,500లకు విక్రయమవుతున్నాయని తెలిపారు. సీజన్‌లో ఆండిపట్టి మార్కెట్‌కు రోజుకు 5 టన్నులు దిగుమతి అయ్యే మల్లెపూలు ప్రస్తుతం 10 కిలోలు కూడా రావడం లేదన్నారు

Comments