చిత్తూరు : అదే విశ్వాసం..అదే ధైర్యం..అదే మొండితనం..మాట తప్పని..మడమ తిప్పని వైనం..అదే వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి. నేటికి సరిగ్గా ప్రజా సంకల్ప యాత్ర ప్రారంభించి 50 రోజులైంది. ఎన్నో వర్గాలను, వేల మంది ప్రజలను బాధలు తెలుసుకుంటూ అలుపెరుగని యోధుడిలా ముందుకు దూసుకుపోతున్నారు. ఎన్నో సమస్యలు తెలుసుకుంటున్నారు. అధికారంలోకి వస్తే సమస్యలన్నీ పరిష్కరిస్తానని హామీ ఇస్తున్నారు. నవరత్నాలతో పేదల బతుకుకు భరోసాగా నిలుస్తానంటున్నారు. ప్రజల కష్టాలు వింటూ..కన్నీళ్లు తుడుస్తూ...నేనున్నానంటూ ఆప్యాయత పంచుతున్నాడు. మీ ఇంటికి పెద్ద కొడుకు నేనే అంటూ పేదల్లో ఒకడిగా..ప్రజల నేతగా..చెరగని ముద్ర వేసుకుంటూ అడుగులు వేస్తుంటే..జగనన్నా మేమూ మీ వెంటే అంటూ లక్షలాది పాదాలు కదులుతున్నాయి. అధికారంలోకి వచ్చి మూడున్నరేళ్లు గడుస్తున్నా టీడీపీ ప్రభుత్వం ఒక్క హామీ నెరవేర్చకపోవడంతో రాష్ట్రంలో తల్లడిల్లుతున్న రైతులు, మహిళలు, నిరుద్యోగులు, ఉద్యోగులకు సాంత్వన చేకూర్చేందుకు వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి 2017 నవంబర్ ఆరున ఇడుపులపాయ నుంచి ప్రజా సంకల్ప యాత్ర ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకూ 180 రోజులు మూడు వేల కిలోమీటర్లు మే పాదయాద్ర చేయనున్నారు. ఈ యాత్ర ద్వారా 125 నియోజకవర్గాల్లో పర్యటించి ప్రజల బాధలు ప్రత్యక్షంగా చూసి రెండు కోట్ల మందిని స్వయంగా కలుసుకోనున్న విషయం పార్టీ వర్గాలు వెల్లడించిన విషయం విధితమే.
అధికార పార్టీ అన్యాయాలను వివరిస్తూ ...
అధికార పక్ష అన్యాయాలను ప్రజలకు వివరిస్తూనే.. వారికి నేనున్నానంటూ ప్రజాసంకల్పయాత్ర ద్వారా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి భరోసా ఇస్తున్నారు. ఆయన చేపట్టిన పాదయాత్ర 50వ రోజుకి చేరుకుంది. మంగళవారం ఉదయం చిత్తూరు జిల్లా మదనపల్లి మండలం సీటీఎం నుంచి వైఎస్ జగన్ తన పాదయాత్రను ప్రారంభించారు. నేటి పాదయాత్ర పులవండ్ల పల్లి, కాశీరావు పేట, వాల్మీకిపురం, ఐటీఐ కాలనీ, పునుగుపల్లి, విఠలం, టీఎమ్ లోయ విూదుగా జమ్మిలవారిపల్లి వరకు కొనసాగుతుంది.

Comments
Post a Comment