శైలాజాకిరణ్‌పై 420 కేసు

ఈనాడు సంస్థ అధినేత రామోజీరావు కోడలు శైలజాకిరణ్‌పై చీటింగ్‌ కేసు నమోదయింది. కేసు పెట్టింది కూడా మార్గదర్శి ఉద్యోగే కావడం గమనార్హం. సంతకాల ఫోర్జరీ వ్యవహారంలో ఆమెపై 420 కేసు నమోదు చేశారు. తొలుత రామోజీ కోడలిపై ఫిర్యాదు తీసుకునేందుకు పోలీసులు ససేమిరా అనడంతో ఉద్యోగి సంగీత నాంపల్లి కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. తన సంతకాన్ని ఫోర్జరీ చేసి ఇల్లీగల్‌ అటాచ్‌మెంట్‌ చేశారంటూ సంగీత కోర్టుకు తెలిపింది. దీంతో వెంటనే మార్గదర్శి చిట్‌ఫండ్‌ ఎండీగా ఉన్న శైలజాకిరణ్‌పై కేసు నమోదు చేయాలని నాంపల్లి కోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాలతో పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఆమెతో పాటు సంస్థ ఉద్యోగులు పార్థసారథి, సంపత్‌, చిట్‌ఫండ్‌ కంపెనీపైనా కేసు నమోదు అయింది. వీరిపై ఐపీసీ 420, 468, 471 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

Comments