పద్మావత్‌ ...2.43 గంటలు

ఎన్నో వివాదాలు..మరెన్నో దాడులు..దేశవ్యాప్తంగా చర్చ. బహుశా ఇంత పెద్ద ఎత్తున హైప్‌ క్రియేట్‌ చేసిన చిత్రం పద్మావతి..సారీ పద్మావత్‌. రాజ్‌ పుత్‌ల ఆందోళనతో ఈ సినిమా విడుదలని నిర్మాతలు తాత్కాలికంగా ఆపివేశారు. ఎన్నో వివాదాలు, అభ్యంతరాలతో పద్మావతి సినిమాని కాస్త పద్మావత్‌గా మార్చి ఈనేల 25న విడుదల చేయాలనీ చూస్తున్నది చిత్ర యూనిట్‌. ఈ సినిమాకి సెన్సార్‌ బోర్డ్‌ యూ/ఏ సర్టిఫికేట్‌ ఇచ్చింది. సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఫిల్మ్‌ సర్టిఫికేషన్‌ విభాగం సూచన మేరకు ఈ సినిమా టైటిల్‌ని పద్మావతి నుంచి పద్మవాత్‌గా మార్చడం జరిగింది. విషయం ఏమిటంటే అక్షయ్‌ కుమార్‌ నటించిన ప్యాడ్‌ మ్యాన్‌ కూడా అదే రోజు విడుదల కానుండడం యాధృచ్ఛికం. పద్మావత్‌ సినిమాలో దీపికా పదుకొనె, రణవీర్‌ సింగ్‌ నాయికా నాయకులుగా నటించగా, సినిమా నిడివి అంతిమంగా 2.43 గంటలు ఉండనుంది.

Comments