2018 వీళ్లదే...

2018 మొత్తం మహిళా కథానాయకురాళ్లే వెండితెరపై వెలగనున్నారు. ఈ ఏడాదిలో బాలివుడ్‌ సహా సౌత్‌ ఇండస్ట్రీలో సినిమాలను పరిశీలిస్తే అన్నీ హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ సినిమాలు కనిపిస్తున్నాయి.. మంచి హైప్‌ క్రియేట్‌ చేసిన పద్మావత్‌ చిత్రంలో దీపికా ట్రెండ్‌ సెట్టర్‌గా నిలిచింది. పద్మావత్‌లో దీపికా నటనకు జనం జేజేలు కొడుతున్నారు. స్క్రీన్‌పై దీపిక అందం..అభినయం పీక్స్‌లో ఉంది. రాజ్‌పుత్‌ రాణిగా..పద్మినిగా దీపక నటన నభూతో నభవిష్యతి అన్న రేంజ్‌లో ఉందని సినీ పండితులు కీర్తిస్తున్నారు. 
తొలిగా దీపిక పదుకొన్‌ ? పద్మావత్‌ రిలీజైంది. ఈ సినిమాలో దీపిక నటనకు అభిమానులు ఖుషీ అయిపోయారు. రాజ్‌పుత్‌ రాణిగా .. పద్మినిగా దీపిక నటన నభూతోనభవిష్యతి అంటూ కీర్తిస్తున్నారు. ఇటు సౌత్‌లో స్వీటీ శెట్టి అలియాస్‌ అనుష్క శెట్టి నటించిన లేడీ ఓరియెంటెడ్‌ సినిమా 'భాగమతి' రిలీజవుతోంది. ఈ శుక్రవారం 'భాగమతి' డే అనే చెప్పాలి. తదుపరి ఏప్రిల్‌ 27న కంగన నటిస్తున్న 'మణికర్ణిక' రిలీజ్‌ కానుంది. ఝాన్సీ లక్ష్మీ భాయ్‌ జీవితకథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రమిది. ఇక 2018 ద్వితీయార్థంలోనూ పలు ఆసక్తికర నాయికా ప్రధాన చిత్రాలు రిలీజ్‌లకు రానున్నాయి. అందాల కథానాయిక సమంత ప్రస్తుతం యూటర్న్‌ రీమేక్‌ లో నటిస్తున్నారు. ఇదీ లేడీ ఓరియెంటెడ్‌ సినిమా. అలాగే 'క్వీన్‌' నాలుగు దక్షిణాది భాషల్లో తెరకెక్కుతోంది. మహిళా ప్రధాన కంటెంట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం ట్రెండింగులో ఉంది. నిత్యామీనన్‌-వికె ప్రకాష్‌ మూవీ నాయికా ప్రాధాన్య చిత్రం. నిత్యా మీనన్‌ ట్రాన్స్‌ జెండర్‌ పాత్రలో నటిస్తుండడం ఆసక్తి రేకెత్తిస్తోంది. శ్రద్ధా కపూర్‌ టైటిల్‌ పాత్రలో బ్యాడ్మింటన్‌ స్టార్‌ సైనా నెహ్వాల్‌ బయోపిక్‌ తెరకెక్కనుంది. ఇలా అన్నీ ఆసక్తి రేకెత్తించేవే. నాయికలే రాణులుగా కనిపించే సినిమాలతో ఏడాది మొత్తం జాతరే!

Comments