తెలంగాణ టీ-20కి బోర్డు ఆమోదం

హైదరాబాద్‌: హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం (హెచ్‌సీఏ) నిర్వహిస్తున్న వెంకటస్వామి స్మారక అంతర్‌ జిల్లాల తెలంగాణ టీ-20 లీగ్‌కు బీసీసీఐ ఆమోదం తెలిపిందని సంఘం అధ్యక్షుడు వివేకానంద్‌ తెలిపారు. అయితే, ఈ టోర్నీలో పాల్గొనే ఆటగాళ్లతో పాటు అధికారులు కచ్చితంగా హెచ్‌సీఏలో రిజిష్టర్‌ అయి ఉండాలని బోర్డు చెప్పిందన్నారు. అలాగే, బీసీసీఐ మార్గదర్శకాలను తప్పకుండా పాటించాల్సి ఉంటుందని స్పష్టం చేసిందని చెప్పారు. గ్రావిూణ ప్రాంతాల్లో ప్రతిభావంతులను వెలికి తీసేందుకు రెండు దశల్లో నిర్వహిస్తున్న ఈ టీ-20 లీగ్‌లో చివరి దశ వచ్చేనెల 3న మొదలవనుంది. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు వేగంగా చేస్తున్నట్టు వివేక్‌ తెలిపారు.

Comments