11న హైదరాబాద్‌లో ఆర్‌పీఐ జాతీయ సదస్సు

హైదరాబాద్‌: రిపబ్లికన్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా(ఆర్‌పీఐ) జాతీయ స్థాయి సదస్సు ఈ నెల 11న హైదరాబాద్‌లో జరగనుంది. ఆర్‌పీఐ దక్షిణ భారతీయ విభాగం అధ్యక్షుడు డాక్టర్‌ ఎం.వెంకటస్వామి బెంగళూరులోని ప్రెస్‌క్లబ్‌లో సోమవారం ఈ విషయం ప్రక టించారు. తెలం గాణ, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలతో సహా మొత్తం 6 రాష్ట్రాల నుంచి ప్రతినిధులు ఈ సదస్సుకు హాజ రవుతారని ఆయన తెలిపారు. అలాగే ఫిబ్రవరి 15న బెంగళూరులో రాష్ట్రస్థాయి సమావేశాన్ని నిర్వహించబోతున్నా మన్నారు. లౌకికశక్తులను బలోపేతం చేసేదిశగా ఏకా భి ప్రాయం కలిగిన పార్టీలతో కలసి పనిచేస్తామన్నారు. కర్ణాటక శాసనసభకు మేలో జరగనున్న ఎన్నికల్లో లౌకిక ఓట్లు చీ లిపోకుండా చూస్తామని పేర్కొన్నారు.

Comments