దేశంలో నల్లధనం విపరీతంగా పెరిగిపోతుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నల్లధనం నిర్మూలన కోసం పెద్ద నోట్ల రద్దు లాంటి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో అప్పటి వరకు చెలామణిలో ఉన్న రూ.1000, రూ.500 నోట్లను రద్దు చేసి వాటి స్థానింలో కొత్తగా రూ.2000, రూ.500 నోట్లు ముద్రించి అందుబాటులోకి తీసుకువచ్చారు. నోట్ల రద్దు సమయంలో దాదాపు 50 రోజులు మాత్రం ప్రజలకు చుక్కలు కనిపించాయి. ఆ తర్వాత పెద్ద నోట్లకు చిల్ల దొరకడం కష్టమైంది. పెద్ద నోట్ల రద్దు తర్వాత చిల్లర కొరతను తగ్గించడానికి రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా రూ.200 నోట్లను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ నోట్లను ప్రస్తుతం బ్యాంకుల ద్వారా మాత్రమే అందిస్తున్నారు. 2016 సెప్టెంబర్లో రూ.2.22 లక్షల కోట్ల నగదును ఏటీఎంల ద్వారా విత్డ్రా చేసుకుంటే, 2017 సెప్టెంబర్లో రూ.2.44 లక్షల కోట్ల నగదు విత్డ్రా అయింది. భారత కరెన్సీలో పెద్దనోట్లు కొత్త రూపం దాల్చి ఏడాది దాటిన తర్వాత తాజాగా ఇప్పుడు 10 రూపాయల నోటు వంతు వచ్చింది. త్వరలోనే పది రూపాయల నోటు సరికొత్త రంగులు అద్దుకోనుంది. చాకోలెట్ బ్రౌన్ రంగులో మహత్మాగాంధీ సిరిస్లో ఈ నోటును విడుదల చేయనున్నారు. ఈ కొత్త నోటుపై కోణార్క్ సన్ టెంపుల్ చిత్రం ముద్రించనున్నారని సమాచారం. ప్రస్తుతం అందుబాటులో ఉన్న పది రూపాయల నోటు డిజైన్ను చివరిసారిగా 2005లో మార్చారు. గతేడాది ఆగస్టులో మహాత్మాగాంధీ సిరీస్లో రూ.50, రూ.200 కొత్తనోట్లు చెలామణీలోకి వచ్చిన సంగతి తెలిసిందే. నకిలీ నోట్ల బెడద నుంచి విముక్తి పొందేందుకు, నగదు వాడకాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించే ప్రయత్నాల్లో భాగంగా చిన్న డినామినేషన్ నోట్లను రీడిజైన్ చేసి అందుబాటులోకి తెస్తున్నారు. కొత్త పది రూపాయాల నోటును ఆర్బిఐ ప్రవేశ పెట్టనుంది.చాకోలెట్ బ్రౌన్ రంగులో మహత్మాగాంధీ సిరిస్లో ఈ నోటును విడుదల చేయనున్నారు. ఈ కొత్త నోటుపై కోణార్క్ సన్ టెంపుల్ చిత్రం ముద్రించనున్నారని సమాచారం.

Comments
Post a Comment