జీఎస్టీ ప్రభావం సినీ పరిశ్రమపై తీవ్రంగా ఉంది. జీఎస్టీ కార్పొరేట్ సంస్థలకే అనుకూలం..సినీ పరిశ్రమకు కాదని సి.కళ్యాణ్ పేర్కొన్నారు. టాలీవుడ్ సహా అన్ని సినీపరిశ్రమల్లో సమస్యలు నివురుగప్పిన నిప్పులా రాజుకుంటున్నాయి. ఉన్నట్టుండి భడభాగ్ని లావాగ్నిలా బయటపడడం ఖాయం అని అంటున్నారు నిర్మాత సి.కళ్యాణ్. మార్చి 1న థియేటర్లని బంద్ చేయడం ఖాయమని, తెలుగులోనే కాకుండా దక్షిణాది పరిశ్రమల్లో ఈ సన్నివేశం కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. షూటింగులు నిలిచిపోయే అవకాశం ఉందని అన్నారు.
క్యూబ్, యూఎఫ్‌వోలపై పోరాటం చేస్తామని అన్నారు. జీఎస్‌టీ విషయంలో తెలుగు నిర్మాతలకు ఇబ్బందులు తలెత్తాయి. జీఎస్టీ విధానం కార్పొరెట్‌కే అనుకూలం.. కార్పొరెట్ అనేది సినిమాని వ్యాపారంగా చూస్తుంది.. కానీ తెలుగు చిత్రసీమలో అభిరుచితో సినిమాలు చేస్తాం.. దీనివల్ల నష్టాలు తప్పవని సి.కళ్యాణ్ అన్నారు. క్యూబ్, యూఎఫ్‌వో పేరుతో కొందరు కోట్లు ఆర్జిస్తున్నారని, సినిమాలు తీసిన నిర్మాతలు నష్టపోతున్నారని అన్నారు. 70 శాతం పైరసీ సెల్‌ఫోన్లతోనే జరుగుతున్నా థియేటర్లలో వాటిపై నిషేధం లేదని, నెమ్మదిగా ఈ పద్ధతి అమలు చేయాలని అన్నారు. సి.కళ్యాణ్ నిర్మించిన 'జై సింహా' ఈ సంక్రాంతికి రిలీజవుతున్న సంగతి తెలిసిందే. సాయిధరమ్ ? వినాయక్ కాంబినేషన్ సినిమా, రానాతో '1945' చిత్రాలు తెరకెక్కిస్తున్నారు. సంఘమిత్ర చిత్రంలోనూ సి.కళ్యాణ్ పెట్టుబడులు పెడుతున్నారుట.

Comments
Post a Comment