బికినీ నంబర్‌ వన్‌

తెలుగు సినీ చరిత్రలో పూజా హెగ్డే బికినీ సీన్‌ ఓ సంచనలం. ఈ ఏడాది గుగూల్‌, యూ ట్యూబ్‌లలో అత్యధిక లైక్స్‌ ఈ బికినీకే పడ్డాయి. డీజే మూవీలో పూజా హెగ్డే నటించిన బికినీ సీన్‌ యువ హృదయాలను ఎంతగా ఇబ్బంది పెట్టిందో వేరే చెప్పనక్కర్లేదు. ఇప్పటివరకూ టాలీవుడ్‌ స్క్రీన్‌ పై చాలామంది భామలే బికినీలో మెరిశారు కానీ.. దువ్వాడ జగన్నాథó చిత్రంలో బ్లాక్‌ బికినీ వేసుకుని పూల్‌ లోంచి నడిచి వస్తున్న పూజ టైపులో ఎవరూ మెప్పించలేకపోయారు. యాక్టింగ్‌ ట్యాలెంట్‌ను పక్కన పెట్టేసి.. ఆ ఒక్క సీన్‌ లో అమ్మడు పంచిన అందాల విందు కారణంగానే.. వరుస ఆఫర్స్‌ అందేశాయంటే ఆ సన్నివేశానికి వచ్చిన రెస్పాన్స్‌ అర్థమవుతుంది. అయితే.. సినిమా రిలీజ్‌ అయిన కొన్ని వారాలకు ఇలాంటి క్రేజీ సీన్స్‌ ను యూట్యూబ్‌లో పోస్ట్‌ చేయడం జరుగుతోంది. కానీ డీజేలో ఈ సీన్‌ ను మాత్రం దాచిపెట్టేశారు నిర్మాత దిల్‌ రాజు. డబ్బింగ్‌ వెర్షన్స్‌ రూపంలో ఇప్పటికే యూట్యూబ్‌ లో ఉన్నా.. తెలుగు వెర్షన్‌కు సంబంధించిన సీన్‌ మాత్రం ఇప్పటివరకూ అధికారికంగా ఆన్‌ లైన్‌ లో లేదు. 
సరిగ్గా న్యూఇయర్‌కు ముందు ఈ సీన్‌ ను తన అఫీషియల్‌ యూట్యూబ్‌ ఛానల్‌లో పోస్ట్‌ చేశాడు దిల్‌ రాజు. జనాలు ఇప్పటికే ఎంటర్టెయిన్మెంట్‌.. ఎంజాయ్మెంట్‌ మూడ్‌లో ఉన్న సమయంలో.. పూజా హెగ్డే బికినీ అందాల విందు సన్నివేశం కూడా అందుబాటులోకి రావడం.. కుర్రకారును బాగానే అట్రాక్ట్‌ చేస్తోంది. ఆన్‌ లైన్‌ లో పబ్లిష్‌ చేసిన కొన్ని గంటల వ్యవధిలోనే మిలియన్‌ వ్యూస్‌ వచ్చేశాయంటే.. పూజా హెగ్డే బికినీ సీన్‌ టైమింగ్‌ ఎంత పర్ఫెక్ట్‌ అనే సంగతి అర్ధమవుతుంది.

Comments