న్యూఇయర్‌ ఎట్యాక్స్‌

కొత్త సంవత్సరం వేడుకలను నిర్వహించేవారు పన్ను విధిగా కట్టాలని తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్‌ అనిల్‌ తెలిపారు. న్యూ ఇయర్‌ సెలబ్రేషన్స్‌కు వసూలు చేసే మొత్తంలో 20 శాతం వినోదపు పన్ను కట్టాల్సిందేనని ఆయన సూచించారు.ఎంటర్‌టెయిన్‌మెంట్‌ టాక్స్‌ కట్టకుండా ఈవెంట్స్‌ నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పన్ను చెల్లించకుంటే ఐదు రెట్లు జరిమానా విధిస్తామని అనిల్‌ చెప్పారు. పన్ను చెల్లింపులపై మరిన్ని వివరాలను తెలుసుకునేందుకు ఈవెంట్‌ ఆర్గనైజర్లు దగ్గర్లోని వాణిజ్య పన్నుల సర్కిల్‌ కార్యాలయాలు, అడిషనల్‌ కమిషనర్లను సంప్రదించాలని ఆయన సూచించారు.

Comments