పోరాటాల్లో నంబర్‌ వన్‌

2017 రాజకీయంగా చాలా ట్విస్ట్‌లు..మార్పులు జరిగాయి ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో వైఎస్సార్‌ సీపీ నంబర్‌ వన్‌ స్థానంలో కొనసాగుతోంది. ప్రతిపక్ష హోదా పాత్రనుపూర్తి స్థాయిలో పోషిస్తున్న ఏకైక పార్టీగా వార్తల్లోకెక్కింది. ఏ రాష్ట్రంలోనూ వైఎస్సార్‌ సీపీలా ఉద్యమాలు, ఆందోళనలు చేయలేదు. నిరంతరం ప్రజాసమస్యలను గుర్తిస్తూ..ప్రభుత్వం వైఫల్యాలను ఎండగడుతూ 2017లో ప్రజల మనసులను గెలుచుకుంది. తెలుగు రాష్ట్రాల్లో 2017లో విపక్ష పార్టీలన్నింటిదీ పోరాట బాటే అయినా అందరికన్నా అత్యధిక పోరాటాలు చేసి వైసీపీ రికార్డు క్రియేట్‌ చేసింది. వైసీపీ చేసినన్ని పోరాటాలు బహుశా ఏ ప్రతిపక్షం చేయలేదంటే అతిశయోక్తి కాదు నిత్యం ఏదో రకంగా వార్తల్లో నిలిచిందా పార్టీ.. మిగతా విపక్షాలూ పోరాడినా.. క్రెడిట్‌ మాత్రం వైసీపీకే.. 
ఏ విపక్షం ఏం సాధించింది? 
తెలంగాణలో కేసీఆర్‌ వార్‌ వన్‌ సైడ్‌ అన్న రీతిలో చెలరేగిపోతే ఆ ఆధిపత్యాన్ని అడ్డుకోడానికి విపక్షాలు మూడు చెరువుల నీళ్లు తాగాయి. ఈ ఎదురు దాడిలో టీ టీడీపీ దారుణంగా దెబ్బ తినగా టీ కాంగ్రెస్‌ మాత్రం నిలదొక్కుకుంది. ఆపరేషన్‌ ఆకర్ష్‌ దెబ్బకు కొత్త ఏడాదిలో తెలంగాణపై టీ-టీడీపీ ఉనికి ఉంటుందా అనే సందేహాలు రేగుతున్నాయి 2017లో తెలంగాణ విపక్షాల ట్రాక్‌ రికార్డ్‌ ఓసారి గుర్తు చేసుకుందాం. 
తెలుగు రాష్ట్రాలు 2017లో చాలా సంయమనంతో ముందుకెళ్లాయి.. విభజన వివాదం సమసిపోగా ఇద్దరు చంద్రులు కాస్త ఇచ్చి పుచ్చుకునే ధోరణిలోనే నడుచుకున్నారు.. అందివచ్చిన అవకాశాల్ని, నిధుల్ని పుష్కలంగా వినియోగించుకుని తెలంగాణ చంద్రుడు మెరిసిపోతే.. నిధుల్లేక.. నీరసించిన రాష్ట్రాన్ని ఏలడంలో బాలారిష్టాల మబ్బుల్లో చిక్కుకున్నాడు ఏపీ చంద్రుడు..

Comments