ఏవండోయ్‌ నాని గారూ..

ఏవండోయ్‌ నాని గారూ..

తెలుగు సినీ చరిత్రలో వరుసుగా ఏడు హిట్లు ఇచ్చిన ఏకైక కథానాయకుడు నాని. మణిరత్నం వద్ద అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేసిన నాని...అష్టాచెమ్మాతో హీరోగా మారాడు. అప్పటి నుంచి కథల ఎంపికలో డిఫరెంట్‌గా వెళుతూ టాలీవుడ్‌లో మోస్ట్‌ సక్సెస్‌ఫుల్‌ హీరోగా మారాడు. ఎటువంటి బ్యాక్‌ గ్రౌండ్‌ లేకుండా కేవలం నటననే నమ్ముకుని దూసుకుపోతున్నాడు. కథ నచ్చితే కొత్తపాత అనే తేడా లేకుండా దర్శకులు అవకాశం ఇస్తూ కొత్త తరాన్ని ప్రోత్సహిస్తున్నాడు. ఈ ఏడాది అద్భుతమైన ఫామ్‌ను కొనసాగించాడు. తాజాగా ఎంసీఏ..మిడిల్‌ క్లాస్‌ అబ్బాయితో విజయం సాధించాడు. 2018లో కూడా ఇదే దూకుడు కొనసాగించాలని భావిస్తున్నాడు. కృష్ణార్జునుల యుద్ధం రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. వచ్చే ఏడాది కూడా మినిమమ్‌ నాలుగైదు సినిమాలు విడుదల చేయడానికి ప్లాన్‌ చేసుకుంటున్నాడు.

Comments

Post a Comment