శీతాకాల విడిది కోసం హైదరాబాద్ వచ్చిన రాష్ర్టపతి రామ్‌నాథ్ కోవింద్ తన పర్యటన ముగించుకుని బుధవారం తిరుగు ప్రయాణమయ్యారు. హకీంపేటలో రాష్ర్టపతికి ముఖ్యమంత్రి కె. చంద్ర శేఖరరావు, మంత్రులు, అధికారులు ఘనంగా వీడ్కోలు పలికారు. ప్రభుత్వం తరఫున కోవింద్‌కు ప్రత్యేక జ్ఞాపికను కేసీఆర్ అందజేశారు. ఈ నెల 24న వచ్చిన రాష్ర్టపతి హైదరాబాద్‌లో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రాష్ర్టపతి రాక సందర్భంగా గవర్నర్ నరసింహన్ ఇచ్చని విందులో ఏపీ తెలంగాణ ముఖ్యమంత్రులు పాల్లొన్న విషయం తెలిసిందే.
హైదరాబాద్ నుంచి ఏపీ పర్యటనకు బయల్దేరి వెళ్లిన రాష్ట్రపతి… అమరావతిలో భారత ఆర్థిక సంఘం(ఐఈఏ) 100వ వార్షిక భేటీని ప్రారంభించారు. ఈ సదస్సుకు గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రులతో పాటు దేశ, విదేశీ ఆర్థికవేత్తలు… 16 దేశాలకు చెందిన 60 మంది ఆర్థికవేత్తలు పాల్గొన్నారు.

Comments
Post a Comment