పాక్ తాట తీద్దాం

పాక్‌పై యుద్ధానికి వెళ్లి ముక్క‌లు ముక్క‌లు చేద్దాం. దాయాది అంతుచూద్దాం..తాడో పేడో తేల్చుకుందాం...అంటూ బీజేపీ ఎంపీ సుబ్ర‌హ్మ‌ణ్య స్వామి ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీని డిమాండ్ చేశారు. కుల్ భూష‌న్ జాద‌వ్ విష‌యంలో పాకిస్తాన్ వ్య‌వ‌హార‌శైలిపై ఆయ‌న ఇలా మండిప‌డ్డారు.పాకిస్థాన్ జైల్లో ఉన్న కుల్ భూషన్ జాధవ్ ను కలిసేందుకు వెళ్లిన తల్లి, భార్యలకు పాక్ లో అవమానం జరిగిన సంగతి తెలిసిందే. వీరిరువురి పట్ల పాక్ భద్రతా సిబ్బంది అమానుషంగా ప్రవర్తించారు. ‘వేరే దుస్తులను వేసుకోమనడం… మంగళసూత్రాలు, గాజులు, బొట్టు, పాదరక్షలను తీసేయమనడం… మాతృ భాషలో మాట్లాడేందుకు ప్రయత్నిస్తే అడ్డుకోవడంలాంటి దుశ్చర్యలకు దిగారు. తిరిగి జాధవ్ భార్య మంగళసూత్రాలు, పాద రక్షలను పాక్ అధికారులు ఇవ్వలేదు’. ఈ ఘటన భారత ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతను నింపింది. ఈ క్రమంలో ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి పాకిస్థాన్ వ్యవహారశైలిపై నిప్పులు చెరిగారు. నీచంగా ప్రవర్తించిన పాక్ పై యుద్ధం ప్రకటించాలంటూ మోదీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పాక్ ను నాలుగు ఖండాలుగా ముక్కలు ముక్కలుగా చేయాలని అన్నారు. ఇప్పుడే యుద్ధానికి వెళ్లాలని చెప్పడం లేదు, యుద్ధానికి గ్రౌండ్ వర్క్ ప్రారంభించాలని కోరారు. ఇది తన వ్యక్తిగత అభిప్రాయం మాత్రమేనని అన్నారు. పాక్ పై సర్జికల్ స్ట్రైక్స్ సరైనవే కానీ దీర్ఘకాల పరిష్కారాన్ని ఇవ్వలేవని అయన తెలిపారు. ఒకవేళ భారత్-పాక్ యుద్ధం సంభవించినా ఇందులో ఏ దేశం కల్పించుకోదని అన్నారు.

Comments