ప్రభాస్ వంటి నటుడ్ని నేనింత వరకూ చూడలేదు. ఆయనతో నటించడం మాటల్లోనే చెప్పలేం. బాహుబలితో అంతర్జాతీయ ఖ్యాతి నార్జించిన ప్రభాస్‌తో సాహోలో నటించడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నానని శ్రద్ధాకపూర్ చెబుతోంది. ఈ సినిమా ముందు వరకూ ప్రభాస్‌తో ఒక్కసారి కూడా మాట్లడలేదని, ఆయన నటించిన డబ్బింగ్ సినిమాలు ఒకటో రెండో చూశానని చెప్పింది. సాహోలో అవకాశం రావడంతో ప్రభాస్ వంటి కో స్టార్ సరసన ఇంతవరకూ ఎందుకు నటించలేదా అన్న ఫీలింగ్ కలిగిందన్నారు. ఆయన నటన, స్టైల్, కోపరేటివ్, సెన్సాఫ్‌హ్యూమర్‌కు ఫిదా అయ్యానని, మరోసారి ఛాన్స్ కోసం ఎదురుచూస్తున్నట్టు అమ్మడు ఆరడుగుల అందగాడిపై ప్రేమ ఒలకబోసింది.

Comments
Post a Comment