ఆ రెండు గదుల్లో ఏమున్నాయో?

  • అందుకేనా శశికళ వర్గీయులు ఆందోళన 
  • పోయెస్‌ గార్డెన్‌ వద్ద ఉద్రిక్త పరిస్థితులు 
జయలలిత మరణించిన తరువాత తమిళనాడు రాజకీయాల్లో రోజుకో సంచలనం నెలకుంటుంది. జయ ఆస్తులపై ఇప్పటికీ అంతు చిక్కన రహస్యం కొనసాగుతూనే ఉంది. తాజాగా శనివారం పోయెస్‌ గార్డెన్‌ వద్ద శనివారం ఉద్రిక్త పరిస్థితులు నెలకున్నాయి. పెద్ద సంఖ్యలో ఐటీ, రెవెన్యూ అధికారులు శనివారం ఉదయమే వేదనిలయానికి చేరుకుని పరిశీలిస్తున్నారు. దీంతో విషయాన్ని తెలుసుకున్న శశికళ వర్గీయులు అక్కడికి చేరుకొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. రంగంలోకి దిగిన పోలీసులు.. పోయెస్‌ గార్డెన్‌ పరిసర ప్రాంతాలను స్వాధీనంలోకి తీసుకున్నారు. ముందు జాగ్రత్త చర్యలో భాగంగా 5 బెటాలియన్లతో ఆ ప్రాంతాన్ని చుట్టాయి. విశాలమైన వేదనిలయం భవంతిని జయ స్మారక కేంద్రంగా మార్చాలని తమిళనాడు ప్రభుత్వం ఇప్పటికే తీర్మానించింది. పొంగల్‌(సంక్రాంతి)లోపే ఆ కేంద్రాన్ని ప్రారంభించాలనుకున్న సీఎం పళని.. ఆ మేరకు చేయవలసిన పనుల బాధ్యతను చెన్నై కలెక్టర్‌కు అప్పగించారు. అయితే, జయ పర్సనల్‌ గదులు రెండింటి విషయంలో కొంత అయోమయం నెలకొంది. ఎందుకంటే.. గతంలో ఐటీ శాఖ వేదనిలయంలో సోదాలు నిర్వహించినప్పుడు ఆ రెండు గదులను సీజ్‌ చేశారు. 
                                                                                                                              - పి.వేణుగోపాల్‌

Comments