Skip to main content
- నేటి నుంచి ఆరంభం
- 30 వరకూ ఫుల్ జోష్

విశాఖపట్నం : విశాఖకు పండగ కళ వచ్చేసింది. వివిధ రాష్ట్రాల నుంచి ప్రకృతి ప్రేమికులు ఇక్కడ అందాలను వీక్షించేందుకు తరలివచ్చారు. డిసెంబర్ 31 వరకూ ఇక్కడే ఉండి న్యూ ఇయర్ వేడుకలను ఘనంగా జరుపుకోవాలని భావిస్తున్నారు. పర్యాటకులను మరింత రంజింపజేయడానికి ప్రభుత్వం విశాఖ ఉత్సవ్‌కు తెరలేపింది. గురువారం నుంచి 30వ తేదీ వరకూ ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే బీచ్ రోడ్డు సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దింది. సహజసిద్ధమైన అందాలకు మెరుగులు దిద్దింది. పచ్చదనం, పరవళ్లు తొక్కుతున్న సాగర అందాలు.. రా...రమ్మని పిలిచేలా విశాఖనగరం మరింత ముద్దుగా ముస్తాబవుతోంది. ప్రముఖ పర్యాటక కేంద్రంగా జాతీయ, అంతర్జాతీయంగా ఖ్యాతి గాంచుతున్న విశాఖనగరాన్ని పర్యాటకంగా మరింత ముందుకు తీసుకువెళ్లేలా.. విశాఖ చరిత్ర భావితరాలకు గుర్తుండేలా రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించతలపెట్టిన విశాఖ ఉత్సవ్ విజయవంతం చేసే విధంగా జిల్లా అధికార యం త్రాంగం ఏర్పాట్లలో తలమునకలై వుంది. గత ఏడాది నిర్వహించిన విశాఖ ఉత్సవ్ విజయవంతం కావడంతో అదే స్ఫూర్తితో ఈ ఏడాది మరింత రెట్టింపు ఉత్సాహంతో ఏర్పాట్లు చేసి ఇటు ప్రభుత్వం, అటు పర్యాటకుల మన్ననలు పొందేలా విశాఖ జిల్లా అధికారులు చర్యలు చేపడుతున్నారు. ప్రపంచానికి చాటిచెప్పే విధంగా ఉత్సవాలు నిర్వహించనున్నారు. నోవాటెల్ ¬టల్ నుంచి వుడా పార్కు వరకూ ఉన్న తీర ప్రాంతంలో ఉత్సవాల వేదికలు ఏర్పాటు చేస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేస్తున్న ఫ్లవర్‌షోను ఈ సారి వుడా పార్కులో కాకుండా ఎంజీఎం పార్కులో ఏర్పాటు చేస్తున్నారు. బ్రెజిల్ తరహాలో కార్నివాల్ ఏర్పాటు చేయాలన్నారు. గతేడాది మాదిరి ప్రధాన దేవాలయాల నమూనాలను బీచ్‌రోడ్డులో ఏర్పాటు చేస్తున్నారు. ఉత్సవాల మూడు రోజులూ పండుగ శోభ వెళ్లివిరిసేలా నగరాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. సాగరతీరంతో పాటు ప్రధాన కూడళ్లను విద్యుత్ దీపాలతో అలంకరించి దేదీప్యమానంగా తయారు చేస్తున్నారు. ఉత్సవాల్లో ప్రముఖ సంగీత దర్శకునితో మ్యూజిక్ నైట్ ఏర్పాటుచేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అలాగే మరికొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటుచేస్తున్నారు. ఆయా కార్యక్రమాల్లో స్థానిక కళాకారులకు ప్రాధాన్యత ఇచ్చే విధంగా అధికారులు చర్యలు చేపట్టారు. అలాగే నగరంలోని అన్ని షాపింగ్ మాల్స్ పెద్ద ఎత్తున డిస్కౌంట్‌లు ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. మూడు రోజుల పాటు లక్కీడిప్ ద్వారా బహుమతులు అందజేయనున్నారు. సింగపూర్, మలేషియా, శ్రీలంక వంటి దేశాలకు టూరిజం ట్రిప్‌లు లక్కీడిప్‌లో చేర్చడం ఈ ఏడాది ప్రత్యేకత.అలాగే పండగలో ఉత్తమ అలంకరణలు నిర్వహించిన సంస్థలకు ¬టళ్ళకు లక్కీడిప్ ద్వారా ప్రత్యేక బహుమతులను అందజేయనున్నారు. ఈ ఉత్సవాల్లో నగరం లోని దుకాణదారులు భాగస్వామ్యం చేస్తున్నారు. ఉత్సవ్ తొలిరోజైన గురువారం సాయంత్రం హలో టీం విశాఖవాసులను ఆనందంలో ముంచనుంది. రెండో రోజు శుక్రవారం ఒక్క క్షణం టీం విశాఖ వాసులను పలకరించనుంది.
Comments
Post a Comment