తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య గల మొట్టమొదటి బంధంలో ఒక భద్రత, నవ్యమైన తీరు, వారి గౌరవాలు ఇమిడి ఉన్నాయని భావిస్తున్నారు. తల్లిదండ్రులకు పుట్టిన బిడ్డకు మధ్య గల బంధమే వారి ప్రేమ అనుబంధం. కొంతమంది మొదటి నిమిషంలో లేదా పాప పుట్టిన రోజునే బంధం పెంచుకోగా, మరి కొంతమంది అధిక సమయం తీసుకుంటారు. ఈ బంధం కొద్ది నిమిషాలలోనే ఏర్పడుతుంది. దీర్ఘకాలం కాదు. దానికి కొంత సమయం అంటూ ఉండదు.
ప్రేమానుబంధం ప్రధానమా... అంటే ప్రేమానురాగాలు పాపకి ఎంతో అవసరం. ఈ అంశంపై సైంటిస్టులు కోతుల తీరు తెన్నులు కూడా పరిశీలించి బిడ్డలకు తల్లిదండ్రుల అవసరం ఎంతైనా ఉందని తేల్చారు. తల్లిదండ్రులు బిడ్డ అవసరాలకు స్పందిస్తే, ఆ బిడ్డ సమాజంలో బాగా అభివృద్ధి చెందుతుందని వెల్లడించారు. చాలా మంది పిల్లలు తక్షణమే తమ తల్లిదండ్రులతో బంధం ఏర్పరచుకుంటారు. అయితే బిడ్డపై తల్లిదండ్రులకు విభిన్న అభిప్రాయాలుంటాయి. మీ పాప మిమ్మల్ని చూసి నవ్విందంటే చాలు మీరు ఆనందంతో నిండిపోతారు. ఈ ప్రేమానుబంధం ఎలా ఏర్పడుతుంది?
ఒక పసివాడి ఆక్రందనలకు జవాబుగా ఉండే తల్లిదండ్రుల తీరు తెన్నులు బిడ్డకు సమాజంలో ఒక స్థానాన్ని సంపాదించిపెడతాయి.
1. పాపచూపు... మీ కళ్లు కలిస్తే చాలు బంధం ఏర్పడుతుంది. అది ఒక సంభాషణ. పాప మీ ముఖ కవళికలను అనుకరించటానికి ప్రయత్నిస్తుంది.
2. స్పర్శ... చర్మానికి చర్మం తగలటం. ఇది ఆనందం కలిగించి పాప ఎదుగుదలకు తోడ్పడుతుంది.
3. వినికిడి... పాపలు తమ తల్లిదండ్రుల స్వరధ్వని వినటానికి ఇష్టపడతారు. దానికి స్పందిస్తారు. పాపతో బంధం పాప పట్ల తీసుకునే జాగ్రత్త మీకు ఎంతో ఆనందాన్నిస్తాయి.
పాపని స్పర్శించటం, జోకొట్టడం, ఊయల ఊపటం, అనురాగం పెంచుతాయి. మీరు మీ భాగస్వామి పాపని స్పర్శిస్తూండటంతో బిడ్డ సైతం ఆ స్పర్శల వ్యత్యాసాన్ని గమనించగలదు.
పాలు పట్టేటప్పుడు, ఊయలలో వేసేటప్పుడు, చిన్నగా పాపకి మసాజ్ చేసేటప్పుడు, పాప అవసరాలు తీర్చేటప్పుడు పాపతో గల స్పర్శానందం అనుభవించి తీరాలి. అప్పుడే తల్లీబిడ్డల బంధం గట్టిగా ఏర్పడుతుంది.

Comments
Post a Comment