ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ మొబైల్ ఉంది. దాంట్లో ఎన్నెన్నో యాప్‌లు నిండిపోయి ఉంటాయి. కాలు కదపకుండా ప్రపంచాన్ని తన గుప్పెట్లో పెట్టుకున్న సామాన్యుడు.. ఆ యాప్‌ల ద్వారా ఎంత ప్రయోజనముందో..అంతే నష్టం కూడా ఉంది. లింక్ వచ్చింది కదా అని యాప్‌లు డౌన్‌లోడ్ చేసుకుంటూ వెళ్లిపోతూ మొదటికే మోసం వచ్చే అవకాశం ఉంది. మారుతున్న కాలానికనుగుణంగా టెక్నాలజీలో కూడా కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి.. ప్రస్తుతం మార్కెట్‌లోకి ఏదైనా ఒక కొత్త ఆండ్రాయిడ్ యాప్ వచ్చిందంటే దానికి నకిలీ యాప్స్ పుట్టుకొస్తున్నాయి. వాటిని డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ చేసే దాకా అవి నకిలీ అని తెలుసుకోలేనంత పకడ్బందీగా వాటిని రూపొందిస్తున్నారు. అయితే కొందరికి అవగాహనలోపంతో వాటిని డౌన్ లోడ్ చేసుకుని వాడుతుంటారు.. కానీ వాటి వల్ల ఏమి ఉపయోగంలేదనుకునే ఆ యాప్స్ పై సంపూర్ణ అవగాహన కలిగిన వ్యక్తులు వాటికి దూరంగా ఉంటున్నారు... అయితే ఈ నీకిలి యాప్స్‌ను ఎలా గుర్తించాలి ఏ విధంగా వాటి భారీ నుంచి బయటపడాలో చూద్దాం.
కొత్త యాప్ డౌన్ లోడ్ చేసేముందు దాని పబ్లిషర్ ఎవరో చూడండి. మీరు ఇప్పటివరకూ వినని పేరైతే గనుక గూగుల్‌లో సెర్చ్ చేయండి. తరువాత నమ్మదగిన పబ్లిషర్స్ యాప్‌ను మాత్రమే డౌన్లోడ్ చేయండి. ఏదైనా యాప్ రిలీజ్ అయితే దాన్ని డౌన్‌లోడ్ చేసే ముందు అది ఏ రోజున రిలీజ్ అయిందో ఒక్కసారి గూగుల్‌లో సెర్చ్ చేయండి. ఆ డేట్‌ను మీరు డౌన్ లోడ్ చేయాలనుకున్న యాప్‌తో కంపేర్ చేయండి. అలా కూడా నకిలీ యాప్స్ బారిన పడకుండా తప్పించుకోవచ్చు. అన్నటికన్నా ముఖ్యంగా, యాప్ డౌన్లోడ్ చేసేముందు ప్లేస్టోర్‌లో యూజర్స్ ఇచ్చిన రివ్యూ, రేటింగ్స్ చదవండి. కొన్ని రివ్యూలు చదివాక, ఈ యాప్ ఎలా ఉండబోతోందో మీకు అర్థమయిపోతుంది. అయితే ఈ రివ్యూస్ లోనూ నకిలీ రివ్యూస్ ఉంటాయి జాగ్రత్త..అఫిషియల్ యాప్స్ చాలావరకూ ట్రైలర్స్‌తో వస్తాయి. ప్లేస్టోర్‌లో ఆ యాప్‌కు సంబంధించిన ట్రైలర్ ఉందో లేదో చూడండి. అంతేకాదు మీరు డౌన్ లోడ్ చెయ్యబోయే యాప్ మీ స్నేహితులెవరైనా వాడుతున్నారా..? లేదా అనేదానిపై విచారించి వారి అభిప్రాయాలను పరిగణంలోకి తీసుకున్న తరువాత యాప్ ను డౌన్ లోడ్ చేసుకోండి.

Comments
Post a Comment