మ‌ళ్లీ భ‌య‌పెడుతున్న బ్లూవేల్‌

హిమాచల్‌లో లొంగిపోయిన యువకుడు 


షిమ్లా:  సూసైడ్‌ గేమ్‌ బ్లూవేల్‌ మళ్లీ తెరపైకి వచ్చింది. బ్లూవేల్‌ గేమ్‌ ఆడుతూ ఎందరో ప్రాణాలు తీసుకున్నారు. నువ్వు ఎప్పుడు ఎలా చనిపోవాలో నిర్దేరించే ఈ గేమ్‌ను నిషేధించినా ఇంకా ఎక్కడో ఒక చోట బ్లూవేల్‌ ప్రాణాలుతీస్తునే ఉంది. గతవారం హిమాచల్‌ ప్రదేశ్‌లోని మండిలోని అంతర్రాష్ట్ర ప్రయాణ ప్రాంగణంలో బాంబు ఉందని కలకలం సృష్టించిన యువకుడు సోమవారం పోలీసుల ఎదుట లొంగిపోయాడు. ఎంసీఏ చదువుతోన్న 21 ఏళ్ల సందీప్‌కుమార్‌ బ్లూవేల్‌ ఆటలో భాగంగానే ఇలాంటి పని చేసినట్లు చెప్పడం ఆశ్చర్యానికి గురిచేసింది. అంతేకాకుండా గతంలో ఈ ఆటలో భాగంగా ద్విచక్ర వాహనాన్ని వేగంగా నడుపుతూ ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించినట్లు విచారణలో తెలిసిందని పోలీసు అధికారి ఒకరు తెలిపారు. సందీప్‌ స్నేహితులు ఎవరైనా ఈ ఆటబారిన పడి ప్రమాదంలో ఉండి ఉంటారనే నేపథ్యంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.

Comments