వెల్‌కమ్‌ వెంకయ్య


  • 30న విజయవాడకు.. 
ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు ఈనెల 30వ తేదీ రాత్రి తొమ్మిది గంటలకు విజయవాడ రానున్నారు.కృష్ణా జిల్లా ఆత్కూరులోని స్వర్ణభారతి ట్రస్ట్‌ ప్రాంగణంలో రాత్రి బస చేస్తారు. 31వ తేదీనస్వర్ణభారత్‌ ట్రస్ట్‌లో జరిగే పలు కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉదయం 9.15 నుంచి 9.45 వరకూ సీనియర్‌ జర్నలిస్టులతో జరిగే అల్ఫాహార విందుకు హాజరవుతారు. 10 గంటల నుంచి 11 వరకూ స్వర్ణభారత్‌ట్రస్ట్‌లో నైపుణ్యాభివృద్ధి శిక్షణ పూర్తిచేసుకున్న అభ్యర్థులకు ధ్రువపత్రాలను అందజేయడంతో పాటూ ఎలీప్‌ సంస్థకు చెందిన కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం చిన్న పిల్లల వినికిడి సంబంధిత సమస్యలకు వైద్యం అందించే ఉచిత శిబిరాన్ని ప్రారంభిస్తారు. రాత్రి స్వర్ణభారత్‌ ట్రస్ట్‌లోనే బస చేసి మరుసటి రోజు జనవరి 1న ఉదయం 11గంటలకు విజయవాడ స్వరాజ్యమైదానంలో 29వ పుస్తక మ¬త్సవాన్ని ప్రారంభిస్తారు. ఉదయం 11.15 నుంచి 12.15 వరకూ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో పుస్తక మ¬త్సవ సంఘం నిర్వహించే సదస్సులో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం ఒంటి గంటకు విజయవాడ విమానాశ్రయానికి చేరుకుని దిల్లీకి వెళ్తారు.

Comments