వాట్సప్‌ హ్యాంగోవర్‌!

ఇది స్మార్ట్‌ యుగం..ప్రపంచంలో అందరూ వినియోగించే సామాన్యవస్తువు సెల్‌ ఫోన్‌. మామూలుగానే సోషల్‌ మీడియాలో ఎక్కువగా గడిపే యువత. న్యూ ఇయర్‌ రోజు ఊరుకుంటుందా? సోషల్‌ మీడియాను హోరెత్తించదూ..ఆ హోరుకు నెట్‌ వర్క్‌లు కూడా బెంబేలెత్తి పోవూ...మరి వాట్సప్‌ పరిస్థితి ఏంటి? న్యూ ఇయర్‌ శుభాకాంక్షలు తెలిపేందుకు వాట్సాప్‌ యాప్‌ది కీలక పాత్రగా మారింది. అంతా న్యూ ఇయర్‌ శుభాకాంక్షలు తెలిపేందుకు రంగంలోకి దిగడంతో? విలవిలలాడిపోయింది వాట్సాప్‌? దీంతో వాట్సాప్‌ యాప్‌ రెండు గంటల పాటు క్రాష్‌డౌన్‌ అయింది. అయితే ఈ అసౌకర్యానికి వాట్సాప్‌ ప్రతినిధులు క్షమాపణలు చెప్పారు. ప్రస్తుతం వాట్సాప్‌ యథావిధిగా పనిచేస్తోంది. 
న్యూ ఇయర్‌ జోష్‌ ఎఫెక్ట్‌ ప్రఖ్యాత మెసేజింగ్‌ సర్వీస్‌ యాప్‌ వాట్సప్‌కు తగలింది. అది క్రాష్‌డౌన్‌ కావడంతో ప్రపంచవ్యాప్తంగా కొద్దిపాటి కలకలమే రేగిపోయింది. 12 గంటలకు నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టడంతో అదే సమయంలో శుభాకాంక్షలు చెప్పుకునేందుకు పోటీపడ్డారు? వేలాది మేసేజ్‌లు ఒకేసారి రావడంతో వాట్సాప్‌ క్రాష్‌ డౌన్‌ అయింది. ఆదివారం అర్ధరాత్రి 12 .05 నుంచి 2 గంటల వరకు? వాట్సాప్‌ సేవలకు అంతరాయం ఏర్పడింది. అంచనాలకు మించి ఊహకు అందని రీతిలో? న్యూఇయర్‌ విషెస్‌ వెల్లువత్తడంతో సాంకేతిక సమస్యలతోనే వాట్సాప్‌ క్రాష్‌ డౌన్‌ అయ్యిందంటున్నారు ఆ సంస్థ ప్రతినిధులు. ప్రపంచ వ్యాప్తంగా ఆయా దేశాల్లోనూ ఈ ఎఫెక్ట్‌ చూపింది. స్థానిక కాలమానం ప్రకారం న్యూ ఇయర్‌ లోకి అడుగుపెట్టగానే ఈ ఎఫెక్ట్‌ స్పష్టంగా కనిపించింది. వాట్సాప్‌ సేవలకు?. న్యూజిలాండ్‌, పసిఫిక్‌ ద్వీపం,ఆస్ట్రేలియా, జపాన్‌, చైనా, హాంకాంగ్‌, ఉత్తర కొరియా, భారత్‌, శ్రీలంక, యూకే, స్పెయిన్‌, నెదర్లాండ్స్‌, ఆగ్నేయ బ్రెజిల్‌లో అంతరాయం కలిగినట్టు తెలిపారు. మొత్తానికి న్యూ ఇయర్‌ జోష్‌ ఇంటా? బయటే కాదు? ఇలా సోషల్‌ విూడియాను కూడా హీటెక్కించింది.

Comments