దివి నుంచి దిగివచ్చావా బెబో బ్యూటీ

  • -పక్కి.వేణుగోపాల్‌ 
కరినా అంటేనే అందాలకు బ్రాండ్‌ అండాసిడర్‌. ఆమె అందచందాల గురించి మన్మథుడు కూడా అసూయ పడతాడు. బాపూ గీసిన బొమ్మల ఉండే ఈ సైజ్‌ జీరో అమ్మడు పెళ్లయిన తరువాత కాస్త బొద్దుగుమ్మగా మారిపోయింది. అయితే మళ్లీ ఆనాటి అందంతో సైజ్‌ జీరోలా కనిపించి అందరికీ షాక్‌ ఇచ్చింది. అసలు ఇప్పుడే బాలీవుడ్‌లో ప్రవేశించిన సూపర్‌మోడల్‌లా ఉందంటే అతిశయోక్తి కాదు. పట్టుదల కేరాఫ్‌ బెబో అని ఒప్పుకుని తీరాల్సిందే. మరోసారి సైజ్‌జీరో రూపానికి షిఫ్టయిపోయింది ఈ సీనియర్‌ నటి. తాజాగా ప్రఖ్యాత మ్యాగజైన్‌ కవర్‌పేజీ కోసం బెబో ఇచ్చిన ఫోజులు చూస్తుంటే ఎవరికైనా మతి చెడాల్సిందే. ఇదిగో ఇక్కడున్న ఛాయాచిత్రం చూశాక ఎవరైనా గ్రీకు సుందరివా? దేవతా సుందరివా? అని పొగిడేయకుండా ఉండలేరు. ఈ ఫోటోషూట్‌ పుకెట్‌ (థాయ్‌ల్యాండ్‌) బీచ్‌ పరిసరాల్లో చేశారు. ఎరికోస్‌ ఆండ్రూ ఫోటోగ్రాఫర్‌. బెబో ప్రస్తుతం 'వీర్‌ ది వెడ్డింగ్‌' చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

Comments