సీఎం ఇంటి ముందు ఆత్మహత్యాయత్నం


అమరావతి : ఆధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంటి ముందు గురువారం ఉదయం ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తమ ఇళ్లు కూలదూసి నష్టపరిహారం ఇవ్వకుండా మూడేళ్లుగా తిప్పుంచుకుంటున్నారని ఇబ్రహీంపట్నం బాధితులంతా ధర్నాకు దిగారు. ఇందులో ఓ బాధితుడు వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ బాటిల్‌ను శరీరంపై పోసుకుని నిప్పంటించుకోబోయాడు. అక్కడున్న భద్రతా సిబ్బంది అలెర్ట్‌ అవడంతో ప్రమాదం తప్పింది.మిగతా వారి దగ్గర పెట్రోల్‌ బాటిళ్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తమకు న్యాయం జరిగే వరకు సీఎం ఇంటి దగ్గర నుంచి కదలమని బాధితులు భీష్మించుకు కూర్చున్నారు. సీఎంను కలవడానికి వస్తే సమయం ఇవ్వడం లేడని, భారీ నీటిపారుదల శాఖా మంత్రి దేవినేని ఉమ మమ్ములను మోసం చేశాడని ఆరోపించారు. నమ్మించి మంత్రి ఉమ తమకు వెన్నుపోటు పొడిశాడని అన్నారు.10 రోజుల్లో నష్ట పరిహారం ఇస్తామని చెప్పి మూడు సంవత్సరాల నుంచి తిప్పుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

Comments