ప్రదీప్‌కు జైలుశిక్ష?

వద్దురా బాబూ..తాగొద్దు..తాగినా వాహనం నడపొద్దు..అలా చేస్తే తాట తీస్తామని పోలీసులు మొత్తుకున్నారు. అయినా సెలబ్రెటీ హోదాలో ఎంచేసినా చెల్లుపోతుందనుకున్న యాంకర్‌ ప్రదీప్‌కు మత్తు దిగేలా పోలీసులు షాక్‌ ఇచ్చారు. అలసే బల్లితెర సూపర్‌ స్టార్‌..పార్టీలు.. పబ్‌లు కామన్‌. హైలెఫ్‌ను ఎంజాయ్‌ చేస్తున్న వారికి ఇది కామనే. అయినా తాగి వాహనం నడిపి..ప్రమాదాలకు కారకులైతే? గతంలో ఇలాగే హైదరాబాద్‌లో తాగి వాహనం నడిపి ఎందరో ప్రాణాలు తీసిన సంఘటనలు ఇంకా కళ్ల ముందే కనిపిస్తున్నాయి. జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 45లో పోలీసులు నిర్వహించిన డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ ప్రదీప్‌ అడ్డంగా దొరికిపోయాడు. పీకల్లోతూ మందేసి సర్రున దూసుకొచ్చిన ప్రదీప్‌ను పోలీసులు ఆపి..బ్రీత్‌ ఎన్‌లైజర్‌ పెట్టారు. బ్రీత్‌ ఎనలైజర్‌లో సాధారణంగా 35 పాయింట్లు వస్తే వాహనం సీజ్‌ చేసి, డ్రైవ్‌ చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేస్తారు. అయితే ప్రదీప్‌ విషయంలో ఎనలైజర్‌ మీటర్‌ దౌడు తీసింది. ఏకంగా 178 పాయింట్లు చూపించేసరికి పోలీసులూ షాక్‌కు గురయ్యారు. ఏ స్థాయిలో ప్రదీప్‌ సీసాలు లాగించేశాడో అర్థమై ఉంటుంది. అతిగా మద్యం సేవించి కారు నడిపినందుకు గానూ ప్రదీప్‌పై కేసు నమోదైంది. అతని కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కొత్త ట్రాఫిక్‌ నిబంధనల ప్రకారం యాంకర్‌ ప్రదీప్‌కు జైలుశిక్ష పడే అవకాశం ఉందంటున్నాయి పోలీసు వర్గాలు? చూద్దాం.

Comments