విరుష్క వివాహ విందులో షారుక్ ఖాన్ డ్యాన్స్ ఇరగదీగయా..మెహ్రీన్ మెరిసిపోయింది. సినీ, క్రీడా ప్రముఖులతో వేడుక చూడ ముచ్చటగా ముగిసింది. తారల తళుక్కులతో క్రీడాకారుల మెరుపులతో విందు పసందుగా జరిగింది. ముంబైలోని సెయింట్ రెజిస్ ¬టల్‌లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో నూతన వధూవరులు అతిథులతో కలిసి మరోసారి చిందేసి ఆకట్టుకున్నారు. 1998లో విడుదలైన 'దిల్ సే' చిత్రంలో ఎంతో ఆదరణ పొందిన 'చయ్య..చయ్య..చయ్య' పాటకు షారుక్‌ఖాన్‌తో కలిసి విరుష్క జోడీ స్టెప్పులేసింది. అలాగే మరికొన్ని పాటలకు డ్యాన్స్ చేసిన వీడియోలు ఇప్పుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. అంతకుముందు షారుక్.. వేదికపై ఉన్న విరుష్క జోడీ వద్దకు వెళ్లి తన సినిమాల్లో ప్రేమకు సంబంధించిన ఫేమస్ డైలాగులను కోహ్లీతో చెప్పించాడు. దీంతో అక్కడ కాసేపు సందడి వాతావరణం నెలకొంది. డిసెంబరు 21న ఢిల్లీలో నిర్వహించిన వివాహ విందులో పంజాబీ పాటలకు కోహ్లీ దంపతులు చిందేసిన సంగతి తెలిసిందే.

Comments
Post a Comment