వీరమహాదేవీ...సన్నీలియోని

హైదరాబాద్‌: బాలీవుడ్‌ బ్యూటీ సన్నీలియోని తొలిసారి దక్షిణాదిన ఓ చారిత్రక చిత్రంలో నటించబోతోంది. తమిళ దర్శకుడు వడి ఉదయన్‌ దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా టైటిల్‌ కాన్సెప్ట్‌ పోస్టర్‌ విడుదల చేసి సస్పెన్స్‌లో ఉంచిన చిత్ర బృందం సినిమా పేరును వెల్లడించింది. సన్నిలియోని నటిస్తున్న ఈ చిత్రానికి 'వీరమహాదేవి' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. 'తెలుగు ప్రేక్షకులకు నమస్కారం. నేను 'వీరమహాదేవి'గా మిమ్మల్ని అలరించనున్నాను. చారిత్రక చిత్రంలో నటించడం ఆనందంగా ఉంది. భారతీయ భాషల్లో ఇది విడుదలకానుంది'' సన్నీలియోని అని అన్నారు. 
అంతకుముందు సరైన టైటిల్‌ను కనిపెట్టిన వారికి సన్నీలియోనితో సెల్ఫీ దిగే అవకాశం కూడా ఇవ్వనున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది. తెలుగు, తమిళం, హిందీ, మలయాళం భాషల్లో ఏకకాలంలో 'వీరమహాదేవి'ని నిర్మించనున్నారు.

Comments